ప్రతీసారి ఆమెతో ఆ అనుభవం కష్టమే...
నిన్ను విజయ్ మాల్యాతో క్రికెట్ మ్యాచ్ లో చూశాను. నిన్నలా చూశాక నీతో ఇంకో కప్పు కాఫీ తాగాలనిపిస్తోందంటూ దీపికకు ట్విట్టర్ సందేశాన్ని పంపాడు బాలీవుడ్ పాతతరం నటుడు షమ్మీ కపూర్. అయితే ఇప్పటికే 'బ్రేక్ కే బాద్' చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న దీపిక షమ్మీ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించింది. ఈ విషయాన్ని మీడియాతో ప్రస్దావించింది దీపిక. ఇంతకుముందు కూడా తాను షమ్మీ కపూర్ అడగడంతో కాఫీ త్రాగానంది. అప్పుడు షమ్మీతో కాఫీ తాగిన అనంతరం దీపిక మాట్లాడుతూ...'ఇంతకు ముందు కూడా షమ్మీ కపూర్‌ను ఒకటిరెండుసార్లు కలిశాను. అయితే ఆయనతో కాఫీ తాగిన అనుభవం మాత్రం ప్రత్యేకమైనది. ఇలాంటి అవకాశాలు మళ్లీమళ్లీ రావానుకుంటున్నాన'ని చెప్పింది. ఈ మాటలనే పట్టుకుని మళ్ళీ పిలిచిన షమ్మీతో...'నమస్తే షమ్మీ అంకుల్. మీరంటే కూడా నాకెంతో ఇష్టం. మీరు నాతో కాఫీ తాగాలనుకుంటున్న సమయానికి నేను షూటింగ్ లో బిజీగా ఉంటాన'ని చెప్పింది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











