‘శంఖం’ సౌండు బీభత్సం
ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా శ్రీ బాలాజీ సినీ మీడియో పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'శంఖం'. శివ దర్శకుడు. టైటిల్ చివర్న 'అం" శబ్ధం తనకు సక్సెస్ నివ్వడం గ్యారెంటీ అని ఫిక్సయ్యాడో, లేక నిజంగానే 'శంఖం" కథపై నమ్మకం పెట్టుకున్నాడో గానీ గోపీ చంద్ చాలా కాన్ఫిడెంట్ గా శంఖం పూరిస్తున్నాడు. 'శౌర్యం" తీసిన దర్శకుడు వాసు డైరెక్షన్ లోనే ఇమ్మీడియట్ గా గోపీ చేసిన ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 11న విడుదలకి సిద్ధమౌతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన త్రిష కథానాయికగా నటించింది. గోపీ సరసన ఒక స్టార్ హీరోయిన్ నటించడం ఇదే మొదటి సారి. 'వర్షం" లో విలన్, హీరోయిన్ గా నటించిన గోపి, త్రిష ఈ చిత్రంలో జంటగా నటించడం విశేషం. ఇప్పుడు ప్రతీ హీరోకి జరుగుతున్నట్లే ఈ చిత్రానికి కూడా గోపి చంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. గోపి కెరీర్లో హయ్యస్ట్ ప్రింట్స్ తో రిలీజవుతోన్న 'శంఖం" ఈ సౌండుకి తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద కూడా మోత మోగిస్తుందేమో చూడాలి.
ఈ సినిమా విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా మంచి క్వాలిటీతో సినిమా తీశారనీ, దర్శకుడు శివ ఈ చిత్రాన్ని 'శౌర్యం' కంటే చాలా బాగా తెరకెక్కించారనీ చెప్పారు. తన కెరీర్ లో ఇదో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందన్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇతర పాత్రలో చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు, ఆలీ, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, ఎంఎస్ నారాయణ, సీత, రజిత, రాధాకుమారి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











