శంకర్ కు నో సెంటిమెంట్స్??
శంకర్ సూపర్ డైరెక్టరే కానీ సూపర్ స్టిషన్స్ ను నమ్మే వ్యక్తి కాదని తేలిపోయింది. సినిమా పరిశ్రమలో ఉన్న సెంటిమెంట్లకు తలొగ్గే మనిషి కాదని స్పష్టమైంది. వివరాలలోకి వెళితే...ఆయన దర్శకుడే అయినా ఎస్ పిక్చర్స్ పేరు మీద సినిమాలు నిర్మిస్తున్నాడు..ఈ బ్యానర్ పై ఈ మధ్య కలూరి సినిమా నిర్మించాడు..ఆసినిమాను డిసెంబర్ 7న శుక్రవారం నాడు విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు శంకర్...కానీ ఈ సినిమాకు సంబంధించిన వారు మాత్రం ఆ రోజు వద్దంటూ పోరు పెట్టారు...డిసెంబర్ 8 అంటే శనివారం విడుదల చేయాలని పట్టుబట్టారు. అదే శంకర్ లక్కీ నంబర్ అంటూ నస పెట్టారు. అదేం కుదరదు పొమ్మన్నాడు శంకర్. డిసెంబర్ 7ననే విడుదల చేస్తానని మొండికేశాడు. తమిళ పరిశ్రమలోని వారు మాత్రం లెక్కలు కడుతున్నారు. ఆయన తీసిన అన్నియన్ జూన్ 17(1+7+8), కాధల్ డిసెంబర్ 8న, 23వ పులకేసి జూన్ 26(2+6=8) ఇలా 8 లక్కీ నంబర్ కాబట్టి కలూరుని డిసెంబర్ 8న విడుదల చేయాలని వాదిస్తున్నారు. ఒక్క రోజు ఆగితే ఆయన సొమ్మేం పోయే అంటున్నారు. అక్కడే శంకర్ కూడా పట్టుమీదున్నాడు 8 సెంటిమెంట్ ను బ్రేక్ చేయడమే ప్రస్తుత కర్తవ్యమని అంటున్నాడు. శివాజీ సినిమా కూడా 8 సెంటిమెంట్ ను బ్రేక్ చేసి ఇంకా నడుస్తోందని ఆయన దగ్గరి మిత్రులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











