తెలంగాణ హీరోలను వెతికి పట్టుకుంటాం
నేను తెలంగాణ ఏరియాలో ఉన్న హీరోలను వెతికి పట్టుకుని వారితోనే సినిమాలు తీస్తాను అని ప్రకటించారు దర్శకుడు ఎన్.శంకర్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచీ సంఘీభావం తెలుపుతున్న ఆయన ఈ విధంగా తెలంగాణ యువతలో ఆశలు నింపారు. ఓ ప్రెవేట్ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ ఈ విషయాలు ఆయన చెప్పుకొచ్చారు. కెసిఆర్ చెప్పిన విధంగా మన హీరోలు, దర్శకులు మనకున్నారు..మనమే మన సినిమాలు నిర్మించుకుందాం అన్న పిలుపుకు ఎన్.శంకర్ స్పందించి ఈ ప్రకటన చేసారని తెలుస్తోంది. ఇక ఎన్.శంకర్ గతంలో ఎనకౌంటర్, జయం మనదేరా, రామ్ వంటి చిత్రాలు డైరక్ట్ చేసారు. ఈ ఉద్యమం ప్రారంభం అయ్యేవరకు ఆయన రాణా కోసం ఓ స్క్రిప్టును తయారు చేసి సురేష్ ప్రొడక్షన్స్ లో సిట్టింగ్స్ జరిపారు. అలాగే సమైఖ్యాంధ్ర గురించి మాట్లాడిన మోహన్ బాబుతో కలిసి యమజాతకుడు, శ్రీ రాములయ్య చిత్రాలు రూపొందించటం తెలిసిందే. ఇక ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్న ఏకైక హీరో నితిన్ మాత్రమే. అతనికి పోటీగా మరికొంత మంది హీరోలను తయారుచేసే అవకాశం ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











