Just In
- 1 hr ago
RRR యూనిట్‌కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్‌ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
- 11 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 11 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 12 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
Don't Miss!
- Finance
భారత్ V షేప్ రికవరీ, నాలుగింట ఒకవంతు తుడిచి పెట్టుకుపోయాయి: RBI
- News
ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది దాడి... 3 నెలలుగా యువతికి టార్చర్... వాడిని వదలొద్దు సార్ అంటూ...
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘ఐ’లో ఎవరినీ కించపర్చలేదు: ఓస్మా జాస్మిన్
హైదరాబాద్: ‘ఐ' సినిమాలో ‘ఓస్మా జాస్మిన్' పాత్రను చిత్రీకరించిన తీరు ట్రాన్స్ జెండర్స్‌ను కించ పరిచే విధంగా ఉందనే ఆందోళనలు, విమర్శలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు శంకర్ మహిరంగ క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ కూడా వెల్లు వెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలో ‘ఓస్మా' పాత్ర పోషించిన నటి ఓజాస్ రజనీ స్పందించారు.
‘సినిమాలో ట్రాన్స్‌జెండర్స్ ను ఎంతమాత్రం కించపరచలేదు, ట్రాన్స్‌జెండర్స్‌ను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయనడం సరికాదు. ట్రాన్స్‌జెండర్స్‌కు సంబంధించిన సన్నివేశాలు కథానుగుణంగా పెట్టినవేనని అన్నారు. శంకర్ దర్శకత్వంలో మేకప్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు ఓజాస్ రజనీ.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మరో వైపు ‘ఐ' సినిమాపై ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. కొనసాగుతున్న ఆందోళనలు శంకర్ ‘ఐ' చిత్రంలో ట్రాన్స్‌జెండర్ ఉమెన్స్‌ను కించపరిచే విధంగా సీన్లు ఉన్నాయని విమర్శిస్తూ సౌతిండియా నటి, రచయిత, ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ స్మైలీ విద్య అలియాస్ స్మైలీ బహరింగలేఖ సంధించారు. శంకర్ చిత్రంలో కొన్ని సీన్లు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని కించ పరిచే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
‘ఐ' సినిమాలో ఓస్మా పాత్రను ఓజాస్ రజనీ పోసించారు. ఓజాస్ రజనీ ఐశ్వర్యరాయ్ తో పాటు పలవురు బాలీవుడ్ స్టార్స్ స్టైలిస్ట్ గా పని చేసారు. అయితే ఓస్మా పాత్రను విలన్ పాత్రగా చిత్రీకరించడంపై ట్రాన్స్ జెండర్స్ ఆగ్రహంగా ఉన్నారు. దర్శకుడు శంకర్ ఇంటి ముందు ఆందోళన చేసేందుకు సిద్దపడ్డారు.
శంకర్ ఇంటి వద్ద, సెన్సార్ బోర్డు ఆఫీసు వద్ద ధర్నా చేస్తామని చెన్నై సిటీకి చెందిన ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో శంకర్ ఇంటికి పోలీసులు భద్రత ఏర్పాటు చేసారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు.
ఈ చిత్రంలో విక్రమ్, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటించారు. శంకర్ దర్శకత్వం వహించాగా ఆస్కార్ ఫిలింస్ పతాకంపై రవిచంద్రన్ నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఆస్కార్ ఫిలింస్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించారు. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ మాత్రం బావున్నాయి.