చిరుతో శంకర్ సినిమా ఇపుడేనా?
చిరంజీవి 149వ చిత్రం కోసం దర్శకుడు వివివినాయక్ అపుడే స్క్రిప్ట్ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతానికి విదేశాలలో ఉన్నప్పటికీ నిర్మాతలు కొంతమంది ఆయనతో సినిమాలు తీయడానికి ఆయనను సంప్రదిస్తున్నట్టు సమాచారం. కూతురు ప్రేమ వ్యవహారం చిరంజీవిని కొంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ పనిలో పడితే ఆయన వాటినుంచి ఆటోమాటిక్ గా బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇంకో విశేషమేమంటే షారూక్ ఖాన్ తో అనుకున్న రోబోట్ సినిమా ప్రాజెక్టు కార్యరూపం దాల్చకపోవడంతో అదివదిలేసి చిరంజీవితో ఎపటినుంచో సినిమా తీయాలనుకుంటున్న సినిమాను ఇపుడు తీస్తే పోలా అని శంకర్ ఆలోచిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. చిరంజీవితో రోబోట్ కథతోనే శంకర్ సినిమా ఉంటుందా అని కూడా అనుకుంటున్నారు. అయితే ఆ సినిమాకు బడ్జెట్ రూ.100 కోట్లు మాత్రమే కావడంతో అంత దమ్మున్న నిర్మాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది ఆచరణ సాధ్యం కాకపోవచ్చు.


Click it and Unblock the Notifications











