రోబో-2 కోసం మరో హీరోను సంప్రదించిన శంకర్!
హైదరాబాద్: ప్రముఖ సౌతిండియా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘రోబో' చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. రజనీకాంత్ నటించడంతో ఈచిత్రానికి కలెక్షన్ల వర్షం కురిసింది. త్వరలో చిత్రానికి సీక్వెల్‘రోబో-2' కూడా రాబోతోంది. అయితే సీక్వెల్ లో రజనీకాంత్ కాకుండా మరొకరు నటిస్తారని తెలుస్తోంది.
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. అందుకు దర్శకుడు శంకర్ కూడా సుముఖత వ్యక్తం చేయడమే కాకుండా ఇప్పటికే స్టోరీ కూడా సిద్ధం చేశాడు. భారీ యాక్షన్ సినిమాను మళ్లీ చేయడానికి తన ఆరోగ్యం సహకరించదని రజనీకాంత్ చెప్పడంతో , మరో హీరో కోసం రిలయన్స్ సంస్థ అన్వేషణ చేస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..... బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా ‘రోబో-2' చిత్రాన్ని చేస్తే బాగుంటుందని శంకర్ ఓ నిర్ణయానికి వచ్చాడని, ఇటీవలే అతన్ని సంప్రధించారని అంటున్నారు. అమీర్ ఖాన్ కూడా స్క్రిప్టు నచ్చి రోబో-2 చేయడానికి సుముఖత వ్యక్తం తెలుస్తోంది. త్వరలో అఫీషియల్ సమాచారం వెలువడనుంది.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహించిన ‘ఐ' సినిమా షూటింగు పూర్తి చేసుకుని పోస్టుప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత ‘రోబో-2'పై పూర్తి స్థాయి దృష్టి సారించనున్నాడు. ప్రస్తుతం అమీర్ ఖాన్ ‘పికె' షూటింగులో ఉన్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే ఇటు సౌతిండియాతో పాటు, అటు నార్త్ ఇండియాలోనూ ‘రోబో-2'పై భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం.


Click it and Unblock the Notifications











