twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండియన్ 2 సెట్ ప్రమాదం.. అది నా మీద పడినా బాగుండేది.. శంకర్ ఎమోషనల్ ట్వీట్

    |

    యూనివర్సల్ హీరో కమల్ హాసన్, ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రం ఇండియన్ 2 (భారతీయుడు 2). ఈ మూవీ సెట్‌లో గత వారం ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్స్ దుర్మరణం చెందగా.. పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ఒక్కసారిగా కోలీవుడ్‌ను ఉలిక్కి పడేలా చేసింది. ఈ దుర్ఘటనపై కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ స్పందించారు. తాజాగా దర్శకుడు శంకర్ ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

    Recommended Video

    Director Shankar Responds On Indian 2 Crane Mishap | Filmibeat Telugu
    ముగ్గురి దుర్మరణం..

    ముగ్గురి దుర్మరణం..

    భారతీయుడు 2 సినిమా షూటింగ్‌ చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో జరుగుతుండగా.. 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి కింద పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కృష్ణ (34), మరో సహాయకుడు చంద్రన్ మృతి చెందారు.

    కోటి విరాళం ప్రకటించిన కమల్..

    కోటి విరాళం ప్రకటించిన కమల్..

    ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు కమల్ హాసన్ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. ఈ ఘటనతో షాక్ తిన్న చిత్రయూనిట్ కొన్ని రోజుల పాటు షూటింగ్‌ను వాయిదా వేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

    వేలెత్తి చూపిన రాధారవి..

    డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధారవి ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంపై స్పందించాడు. హాలీవుడ్ రేంజ్‌లో సినిమాలు తీయడం కాదు.. తన సెట్‌లో పని చేసేవారి జాగ్రత్తలను ముందు చూసుకోవాలంటూ పరోక్షంగా శంకర్‌పై కామెంట్ చేశాడు.

    అది నా మీద పడినా బాగుండేది..

    అది నా మీద పడినా బాగుండేది..

    ‘ఈ ఘటన జరిగినప్పటి నుంచి నేను నిద్ర లేని రాత్రులు గడుపుతూనే ఉన్నాను.. ఆ క్రేన్ నాపైన పడినా బాగుండేది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, వారంతా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను అత్యంత బాధతో ఈ ట్వీట్‌ చేస్తున్నాను. నా అసిస్టెంట్ డైరెక్టర్, నా బృందాన్ని కోల్పోయిన షాక్‌లోంచి నేను రాలేకపోతున్నా'ను అంటూ ఎమోషనల్ అయ్యాడు.

    English summary
    Shankar Emotional Tweet About Accident On Indian 2 set. Kamal Haasan Announced One Crore Donation, Who Died In Accident On Indian 2 set. Last night Major accident occured in Bharatheeyudu 2 shooting. In this Accident three people had died and ten people including director Shankar injured.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X