షారూక్ ఖాన్ రోబోట్ వద్దన్నాడా?
శంకర్, షారూక్ ల రోబోట్ ఎందుకు కార్యరూపం దాల్చలేదనడానికి రెండు విరుద్ధ కారణాలు చెబుతున్నారు. ఈ కథలో ఎంతమాత్రం కొత్తదనం లేకపోవడం మూలానే షారూక్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ కు టాటా చెప్పాడని ఒక వర్గం అంటుంటే మరొక వర్గం కథనం వేరేగా ఉంది.
శివాజీ లాంటి సక్సెస్ ఫుల్ సినిమా తీసిన శంకర్ రోబోట్ సినిమాకు పెట్టే పెట్టుబడిలో 25శాతం తన రెమ్యునరేషన్ గా అడిగాడట. అంటే ముందుగా అనుకున్నట్టు రోబోట్ సినిమాకు రూ.100 కోట్ల ఖర్చు పెడితే రూ.25 కోట్లు శంకర్ కు వెళతాయన్నమాట. మరో రూ.10 కోట్లు యూనిట్ కోసం ఖర్చు చేయాలట. హిందీ సినిమాకు మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న దర్శకునికి అంతేసి ఇవ్వడానికి వెనకడుగు వేశారట. ఇంతకుముందు కూడా ఇలాంటి లింకు పెట్టడంవలననే హిందీ నిర్మాతలు శంకర్ తో సినిమా అంటే నో అన్నారట. ఇంతకు ఈ సినిమాకు ప్రొడ్యూసరెవరో తెలియదు కానీ ఇలాంటి ధైర్యం చేయకుండా ముందే నిర్ణయం తీసుకోవడం సరైన పనిగానే విశ్లేషకులు భావిస్తున్నారు.
శంకర్ దర్శకత్వంలో రూపొందిన శివాజీ సినిమా దర్శకత్వ ప్రతిభ వలన కాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ కున్న ఫాలోయింగ్ వలననే అని అందరూ అనుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఆ సినిమాకు పెట్టిన భారీ పెట్టుబడి తిరిగివచ్చిందని, అదే హీరో వేరే అయితే నిర్మాత చేతులు కచ్చితంగా కాలేవని అంటున్నారు.


Click it and Unblock the Notifications











