శంకర్, విక్రమ్ ‘ఐ’ వర్కింగ్ స్టిల్స్(ఫోటో ఫీచర్)
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రస్తుతం 'ఐ' అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం త్వరలో హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోనుంది. ఇక్కడ ఓ పాట,కొన్ని కీలకమైన సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇక్కడ హైదరాబాద్ లో ఇరవై రోజులు షెడ్యూల్ వేసినట్లు తెలుస్తోంది.
శంకర్ చిత్రమంటేనే ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్. అందులో అపరిచితుడు కాంబినేషన్ రిపీట్ చేస్తూ చిత్రం రూపొందిస్తున్నాడంటే ఆ చిత్రం విశేషాలు తెలుసుకోవటానికి అందరకీ ఆసక్తే. ఈ నేపధ్యంలో ఈ రిపీట్ కాంబినేషన్ రూపొందిస్తున్న కొత్త చిత్రం ఐ చిత్రం కాన్సెప్ట్ లీక్ అయ్యిందంటూ చెన్నై ఫిల్మ్ సర్కిల్సో లో వినపడుతోంది.
ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎమిజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అపరిచితుడు' విడుదలై ఇప్పటికి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది.

చాలా విరామం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ‘ఐ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

త్రీ ఇడియట్స్ రీమేక్ చేసిన శంకర్ ఆ చిత్రం వర్కవుట్ కాకపోవటంతో ఈ సారి మళ్లీ తన రూట్ లోకే వెళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

భారీగా రూపొందే ఈ చిత్రం ఇప్పటివరకూ ఇండియన్ తెరపై ఎవరూ టచ్ చేయని సబ్జెక్టుతో నిండి ఉంటుందని చెప్తున్నారు.

యాక్షన్, ఎంటర్టైనర్ తో మాస్ మసాలాగా ఉంటూనే సామాజిక సందేశంతో తయారు చేసిన ఈ స్క్రిప్టు దక్షిణాది భాషలకే కాక హిందీ వారిని సైతం అలరించేలా ప్లాన్ చేస్తున్నారు.

సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘హారీపొటర్' చిత్రానికి పనిచేసిన ఆస్ట్రేలియన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్స్‌ని అందిస్తోంది.

‘మెన్ ఇన్ బ్లాక్' లాంటి హాలీవుడ్ చిత్రానికి పనిచేసిన మారీ ఓగ్ట్ ఈ చిత్రానికి కాస్టూమ్స్ డిజైనర్‌గా సేవలందించనున్నాడు.

చైనాకు చెందిన ఫైట్‌మాస్టర్ పీటర్ మింగ్ ఈ చిత్రానికి పోరాట దృశ్యాలని సమకూర్చనున్నాడు.

ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరాం.

ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అందిన ఆసక్తికర విషయం ఏమిటంటే ఈచిత్రంలో విక్రమ్-అమీ జాక్సన్ మధ్య లిప్ లాక్ సీన్ ఉందట.


Click it and Unblock the Notifications











