twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చైనా లొకేషన్లలో శంకర్ ‘ఐ’(ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ఇండియాలోనే గ్రేట్ ఫిల్మ్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ తాజాగా 'ఐ' అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దాదాపు రూ. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తన రేంజికి తగిన విధంగా రూపొందిస్తున్న శంకర్ ప్రపంచంలోని ప్రఖ్యాత లొకేషన్లను ఈచిత్రంలో చూపించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగు చైనాలో జరుగుతోంది. తాజాజా అందుకు సంబంధించిన కొన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ విడుదలయ్యాయి.

    చైనా లొకేషన్లలో శంకర్ ‘ఐ’(ఫోటోస్)

    షూటింగ్ స్పాట్లో టెక్నీషియన్స్ తో మాట్లాడుతున్న శంకర్

    చైనా లొకేషన్లలో శంకర్ ‘ఐ’(ఫోటోస్)

    చైనా పకృతి అందాల మధ్య అమీ జాక్సన్

    చైనా లొకేషన్లలో శంకర్ ‘ఐ’(ఫోటోస్)

    అందమైన లొకేషన్లో సేదతీరుతున్న శంకర్

    చైనా లొకేషన్లలో శంకర్ ‘ఐ’(ఫోటోస్)

    షూటింగ్ స్పాట్లో మెగా ఫోన్ తో శంకర్

    చైనా లొకేషన్లలో శంకర్ ‘ఐ’(ఫోటోస్)

    ఐ మూవీ షూటింగ్ స్పాట్లో చైనా సుందరాంగులు

    చైనా లొకేషన్లలో శంకర్ ‘ఐ’(ఫోటోస్)

    పిసి శ్రీరామ్ తో శంకర్

    చైనా లొకేషన్లలో శంకర్ ‘ఐ’(ఫోటోస్)

    లొకేషన్లను వీక్షిస్తున్న శంకర్, పిసి శ్రీరామ్

     చైనా లొకేషన్లలో శంకర్ ‘ఐ’(ఫోటోస్)

    షూటింగ్ స్పాట్లో దర్శకుడు శంకర్, హీరోయిన్ అమీ జాక్సన్, హీరో విక్రమ్, సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్

    ఇందులో విక్రమ్, ఎమీ జాక్సన్ జంటగా నటిస్తున్నారు. రెండు విభిన్న పాత్రల్లో విక్రమ్ కనిపిస్తాడని వార్తలొస్తున్నాయి. విశేషమేమిటంటే, రెండు పాత్రల మధ్యా బాడీ విషయంలో వైవిధ్యాన్ని బాగా చూపిస్తున్నారట. ఒక పాత్రలో విక్రమ్ సన్నగాను, మరో పాత్రలో లావుగాను కనపడతాడు. దీంతో ముందుగా సన్నగా వున్న పాత్రకు సంబంధించిన సీన్స్ చిత్రీకరిస్తారట. తర్వాత కొంత గ్యాప్ తీసుకుని విక్రమ్ బరువు పెరిగాక, దానికి సంబంధించిన సన్నివేశాల భాగాన్ని షూట్ చేసేలా ప్లాన్ చేశారు. ఈ భారీ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్నాడు.

    ఈ చిత్రానికి పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'హారీపొటర్' చిత్రానికి పనిచేసిన ఆస్ట్రేలియన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్స్‌ని అందిస్తోంది. 'మెన్ ఇన్ బ్లాక్ ' లాంటి హాలీవుడ్ చిత్రానికి పనిచేసిన మారీ ఓగ్ట్ ఈ చిత్రానికి కాస్టూమ్స్ డిజైనర్‌గా సేవలందించనున్నాడు.

    చైనాకు చెందిన ఫైట్‌మాస్టర్ పీటర్ మింగ్ ఈ చిత్రానికి పోరాట దృశ్యాలని సమకూర్చనున్నాడు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో శంకర్‌, విక్రమ్‌ కాంబినేషన్‌లో వ‌చ్చిన‌ అపరిచితుడు చిత్రం కమర్షియల్‌గా సూపర్‌హిట్‌ కొట్టిన సంగ‌తి తెలిసిందే.

    English summary
    What's a Shankar film without rich costumes, colourful sets and famous locations? While we are still clueless about costumes and sets, we have got a piece of information on the locations where his next movie will be shot.
 We have recently reported that Shankar's I unit left to China to shoot the important portions of the movie. The latest news is that the film will be shot in eight popular destinations of the Land of Sleeping Giants. As a matter of fact, they will approximately cover 30,000 km. However, the names of the exotic locales have not been revealed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X