twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సాహో’ మ్యూజిక్ డైరెక్టర్ ఔట్... గొడవకు కారణం వివరించిన శంకర్ మహదేవన్!

    |

    'బాహుబలి' తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం 'సాహో'. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ హాలీవుడ్ సినిమా స్థాయికి ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి సినిమాకు సంగీతం అదించడం కూడా ఒక సవాలు లాంటిదే. అందుకే ప్రఖ్యాత సంగీత త్రయం శంకర్-ఎస్సాన్-లాయ్‌ను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారు. అయితే మరో మూడు నెలల్లో మూవీ విడుదలవుతుండగా ఉన్నట్టుండి ఈ ప్రాజెక్ట్ నుంచి వీరు తప్పుకోవడం చర్చనీయాంశం అయింది. ఇటీవల విడుదలైన సినిమా పోస్టర్‌పై కూడా వీరి పేరు లేకపోవడంతో చాలా రోజుల క్రితమే వీరు ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినట్లు స్పష్టమైంది.

    మీడియా ముందుకు శంకర్ మహదేవన్

    మీడియా ముందుకు శంకర్ మహదేవన్

    ఈ ప్రాజెక్ట్ నుంచి వారు తప్పుకోవడానికి కారణం ఏమిటనే విషయంలో ఆసక్తికర చర్చ సాగుతున్న తరుణంలో..... శంకర్ మహదేవన్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. నిర్మాతలతో అభిప్రాయ విభేదాల కారణంగానే తాము తప్పుకునప్నట్లు చెప్పిన ఆయన అసలు ఏం జరిగిందో పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు.

    గొడవకు అసలు కారణం అదే

    గొడవకు అసలు కారణం అదే

    మేము ‘సాహో' సినిమాకు పాటలు కంపోజ్ చేస్తుండగా నిర్మాతలు ఇతర కంపోజర్లతో కూడా మరిన్ని పాటలు చేయించి సినిమాలో యాడ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ విషయం మాకు నచ్చలేదు. ఈ విషయంలోనే ఇరు వర్గాల మధ్య అభిప్రాయ విభేదాలు వచ్చినట్లు శంకర్ మహదేవన్ తెలిపారు.

    రాజీపడం ఇష్టం లేదు

    రాజీపడం ఇష్టం లేదు

    ఈ సినిమాకు సంగీత దర్శకులుగా మా పేరు మాత్రమే ఉండాలని మేము కోరుకున్నాం. భవిష్యత్తులో ‘సాహో'కు సంగీతం అందించింది ఎవరు? అంటే శంకర్-ఎస్సాన్-లాయ్‌ అనే పేరు మాత్రమే వినిపించాలని మేము కోరుకోవడంలో తప్పులేదు, అది మా బ్రాండ్‌ ఇమేజ్‌కు సంబంధించిన విషయం కాబట్టే రాజీపడటానికి ఇష్టం లేక తప్పుకున్నట్లు తెలిపారు.

    కనీసం పాటలు మొత్తం అయినా ఇవ్వాలని అడిగాం

    కనీసం పాటలు మొత్తం అయినా ఇవ్వాలని అడిగాం

    ‘సాహో'కు పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మేము అందించాలని అనుకున్నాం. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం ఇప్పటికే వేరొకరిని నియమించుకున్నారు. కనీసం పాటల పూర్తి బాధ్యత మాకు ఇవ్వాలని కోరాం. అందుకు కూడా వారు అంగీకరించకపోవడం మాకు నచ్చకే తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

    ఈ మధ్య కామన్ అయింది, కానీ...

    ఈ మధ్య కామన్ అయింది, కానీ...

    ఈ మధ్య కాలంలో ఒకే సినిమాకు మల్టీ కంపోజర్స్ పని చేయడం సర్వసాధారణం అయిపోయింది. దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ మాకు అలా చేయడం ఇష్టం లేదు. చేస్తే మేము చేయాలి, లేక పోతే మరొకరు చేయాలి, అప్పుడే ఆ సినిమాకు సంబంధించిన సంగీతం విషయంలో సరైన గుర్తింపు, గౌరవం లభిస్తుందని మా భావన అని శంకర్ స్పష్టం చేశారు.

    English summary
    Music composer trio Shankar-Ehsaan-Loy opted out of the film Saaho. Recently, they revealed that they were 'uncomfortable' working with other composers who were apparently roped in to compose additional songs. Speaking with IANS, Shankar Mahadevan told, "The music company wanted to add a few songs from external composers. We are not very comfortable with that. Normally, we prefer to remain the sole composers of the film. That's why we decided to opt out."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X