twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శంకర్ మహదేవన్‌కు ఆశాభోంస్లే అవార్డు

    By Srikanya
    |

    అఖిల భారతీయ మరాఠీ నాట్య పరిషత్, పింప్రిచించ్వాడ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఇచ్చే ఆశాబోంస్లే అవార్డుకు ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఎంపికైనట్లు నాట్య పరిషత్ శాఖాధ్యక్షులు భావు సాహెబ్ భోయిర్ తెలిపారు. ఈ అవార్డును ఆశాభోంస్లే జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇస్తున్నట్లు చెప్పారు. అవార్డు కింద 1.11 లక్షల రూపాయలతో పాటు జ్ఞాపికను అందజేయనున్నట్లు భోయిర్ తెలిపారు. చెన్నైకి చెందిన శంకర్ మహదేవన్ తమిళ కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచి భారతీయ శాస్త్రీయ, కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. హిందీ, దక్షిణ భారత దేశ భాషల్లో సంగీతాన్నందించి జాతీయ అవార్డును సొంతం చేసుకొని, ఉత్తమ గాయకుడిగా ఖ్యాతి గడించారు.

    English summary
    Well-known singer Shankar Mahadevan has been selected for the annual Asha Bhosle award of this year by the Pimpri Chinchwad unit of Akhil Bharatiya Marathi Natya Parishad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X