శంకర్ ‘మనోహరుడు' (ఐ) కొత్త వర్కింగ్ స్టిల్స్
హైదరాబాద్: విక్రమ్ హీరోగా శంకర్ రూపొందిస్తున్న 'మనోహరుడు' చిత్రం 75 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అమీ జాక్సన్ హీరోయిన్. తమిళంలో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న 'ఐ' చిత్రానికి ఇది తెలుగు రూపం. మలయాళ నటుడు సురేశ్‌గోపి, తమిళ టాప్ కమెడియన్ సంతానం మరో రెండు కీలక పాత్రలు చేస్తున్నారు.
ఈ చిత్రంలో విక్రమ్ పాత్ర, ఆయన వేసే గెటప్పులు హైలైట్‌గా నిలవనున్నాయి. కథ ప్రకారం ఈ సినిమాలో భౌతికంగా విక్రమ్ రూపం మార్పుకు గురవుతుంది. న్యూజిలాండ్‌కు చెందిన వెటా స్టూడియో విక్రమ్ ఆహార్యానికి సంబంధించిన పనులు చూసుకుంటోంది.
విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన 'అపరిచితుడు' తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 'మనోహరుడు' చిత్రం దాన్ని మించి మరింత పెద్ద విజయం సాధించడమే కాక, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల్ని సృష్టించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
శంకర్ వర్కింగ్ స్టిల్స్ తో స్లైడ్ షో ...

న్యూ జ్ లాండ్ లోని వెటా వర్క్ షాప్ గేట్ వద్ద శంకర్ ఇలా నిలబడి ఫోటో దిగారు. పీటర్ జాక్సన్స్ ట్రయాలిజీ ...ది లార్జ్ ఆఫ్ ది రింగ్స్ తర్వాత ఈ వర్క్ షాప్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 1987 నుంచి ఈ వర్క్ షాప్ ఎన్నో టీవీ షోలకు, సినిమాలకు సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చింది.

రిచ్చర్డ్ టేలర్ తో కలిసి శంకర్ ఈ ఫోటో దిగారు. రిచ్చర్జ్ టేలర్ అంటే ఈ వెటా వర్క్ షాప్ ఫౌండర్. ఈ వర్క్ షాప్ అంటే శంకర్ కు చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన గతంలోనూ బ్లాగ్ లో ప్రస్దావించారు. ఈ చిత్రం సందర్బంగా ఆయన ఇక్కడకు వచ్చారు. అయితే ఎందుకు వచ్చారు. ఏమిటనే విషయాలు తెలియరాలేదు.

ఛాయాగ్రాహకులకు గురువుగా భావించే పి.సి శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. వీళ్లిద్దరూ కలిసి వర్క్ కో ఆర్డినేషన్ చేసుకుంటూ సినిమాను అద్బుతంగా రూపొందిస్తున్నట్లు సమాచారం. పి.సి శ్రీరామ్ ఎక్కువగా మణిరత్నం చిత్రాలకు పని చేసారు. ఇక రీసెంట్ గా నితిన్ చిత్రం ఇష్క్ కు కూడా ఆయనే కెమెరా అందించారు.

ఈ చిత్రం కోసం శంకర్ .. స్టంట్ సీన్ ని నేరేట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక బాలీవుడ్ సినిమా 'త్రీ ఇడియట్స్' ని రీమేక్ చేసిన తరవాత శంకర్... మళ్లీ తన శైలిలోకి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. విక్రమ్‌ని దృష్టిలో పెట్టుకొని శంకర్ ఈ కథను సిద్ధం చేసుకొన్నారని సమాచారం.

బెస్ట్ స్టంట్ డైరక్టర్ గా 2012 లో Thadaiyaara Thakka కి అవార్డు పొందిన అనల్ అరుసు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన పనితనం అద్బుతంగా ఉండబోతోందని చెన్నై వర్గాల సమాచారం. ఈ చిత్రం ఒప్పుకున్న తర్వాత ఆయన వేరే చిత్రాలు కమిట్ కాలేదు. పూర్తిగా ఈ చిత్రానకే ఆయన టైం మొత్తం వెచ్చిస్తున్నారు.

ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ.

ఈ చిత్రానికి ‘ఐ' అనే టైటిల్ ప్రకటించి, ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం టైటిల్ ని ‘ఎఐ' గా శంకర్ మార్చారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్ ద్వారా తెలియచేసారు. త్వరలోనే ఈ కొత్త టైటిల్ తో పోస్టర్స్ విడుదల చేస్తారు.

జూలై 15 వ తేదీన ఈ చిత్రం గురించి కొన్ని ఫోటోలతో పాటు..కొన్ని డిటేల్స్ ని తన బ్లాగ్ లో శంకర్ పెట్టారు. ఇప్పటికి దాదాపు ముప్పావు శాతం షూటింగ్ పూర్తైందని ఆయన చెప్పారు. ఈ చిత్రం విక్రమ్ అభిమానులు ఆనందపడేలా వస్తోందని అన్నారు. ఈ చిత్రం టైటిల్ మార్చటానికి కారణం ఉందని,అది త్వరలో తెలియచేస్తానని అన్నారు.

ఇక శంకర్ చిత్రమంటేనే ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్. అందులో అపరిచితుడు కాంబినేషన్ రిపీట్ చేస్తూ చిత్రం రూపొందిస్తున్నాడంటే ఆ చిత్రం విశేషాలు తెలుసుకోవటానికి అందరకీ ఆసక్తే. ఇక ఈ చిత్రం టీమ్ న్యూజ్ లాండ్ లోని వెటా వర్క్ షాప్ కి వెళ్లింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మిగతా షూటింగ్ రెగ్యులర్ గా జరగనుందని తెలుస్తోంది.

తెలుగులో ఈ చిత్రం ‘మనోహరుడు' పేరుతో విడుదల కానుంది. ‘అపరిచితుడు'లో విక్రమ్ చేత మూడు రకాల షేడ్స్‌లో పాత్ర చేయించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు శంకర్. ఇప్పుడు ‘మనోహరుడు'లో విక్రమ్ చేసే పాత్ర తన కెరీర్‌లోనే భిన్నమైందని తెలుస్తోంది.
ఆ పాత్ర కోసం విక్రమ్ ఏకంగా 30 కిలోల బరువు తగ్గారని సమాచారం.

చైనా వెళ్లి అక్కడి శిక్షకుల నేతృత్వంలో కఠినమైన వ్యాయామాలు చేసి 30 కేజీలు వెయిట్ లాస్ అయ్యారట విక్రమ్. స్లిమ్ అయిన విక్రమ్ లొకేషన్‌లోకి రాగానే అవాక్కవ్వడం అక్కడున్నవారి వంతైందని వినికిడి. ఈ సినిమా షూటింగ్ 75 శాతం పూర్తయింది. అవుట్‌పుట్ విషయంలో శంకర్ ఎంతో సంతృప్తిగా ఉన్నారని సమాచారం.

శంకర్ సినిమా అనగానే గుర్తొచ్చేది విజువల్ ఎఫెక్ట్స్. తన గత చిత్రాలను మించే రేంజ్‌లో ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని వినికిడి. న్యూజిలాండ్‌లోని వెటా స్టూడియో వారు ఈ సినిమాకు చెందిన విజువల్ ఎఫెక్ట్స్‌ని తీర్చి దిద్దుతున్నారు.

వందకోట్ల భారీ వ్యయంతో రూపొందుతోన్న ఈ చిత్రం ‘ఐ' ఫీస్ట్‌గా ఉండబోతోందని యూనిట్ వర్గాలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. ‘జెంటిల్‌మెన్' నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న శంకర్ స్పీడ్‌కి ‘స్నేహితుడు' చిత్రం బ్రేక్ వేసింది. అందుకే కసితో మనోహరంగా శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట.

అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం, పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











