హీరోయిన్‌తో డైరెక్టర్ వివాహం: స్టార్స్ సందడి (ఫోటోస్)
చెన్నై: ప్రముఖ సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ శిష్యుడు, యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్(రాజా రాణి దర్శకుడు) వివాహం చెన్నైలో ఆదివారం చెన్నైలో ఘనంగా జరిగింది. తమిళ నటి కృష్ణ ప్రియను అట్లీ కుమార్ పెళ్లాడారు. ఈ వేడుకకు తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు.
తమిళ సినీ స్టార్స్ శంకర్, బాల కుటుంబ సభ్యులతో హాజరవ్వగా, నిర్మాత ఎఎం రత్నం, కలైపులి ఎస్ థాను, నాజర్, శశికుమార్, శివకార్తికేయన్, నందా, మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జైరాజ్, జివి ప్రకాష్, కెమెరామెన్ జార్జ్ సి విలిమయ్స్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వివాహ వేడుకలో దర్శకుడు శంకర్ చేతుల మీదుగా వరుడు అట్లీ కుమార్ మంగళసూత్రం అందుకున్నారు. వివాహం అనంతరం వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్ ఫ్యామిలీ, సత్యరాజ్ ఫ్యామిలీ, ప్రభు ఫ్యామిలీ, దర్శకుడు కెఎస్ రవికుమార్ ఫ్యామిలీ తదితరులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

అట్లీ కుమార్ వివాహం
కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో అట్లీ కుమార్ వివాహ వేడుక.

మంగళసూత్రం
వరుడు అట్లీ కుమార్‌కు మంగళ సూత్రం అందిస్తున్న ప్రముఖ దర్శకుడు శంకర్.

విజయ్ విత్ వైఫ్
అట్లీకుమార్, కృష్ణ ప్రియ వెడ్డింగ్ రిసెప్షన్‌కు తన భార్యతో కలిసి హాజరయ్యాడు ప్రముఖ హీరో విజయ్.

బాల
దర్శకుడు బాలతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తున్న నూతన వధూవరులు.

శింబు
అట్లీ కుమార్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖ నటుడు శింబు.

ఫ్యామిలీతో కెఎస్ రవికుమార్
అట్లీ కుమార్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ ఫ్యామిలీతో హాజరయ్యారు.

ప్రభు
ప్రముక తమిళ నటుడు ప్రభు ఈ వివాహ వేడుకకు తన కొడుకుతోకలిసి హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











