2.O ప్రీ రిలీజ్ రివ్యూ: శంకర్, రజనీ మరోసారి మ్యాజిక్.. రికార్డుల మోతకు రెడీ!
భారతీయ సినిమా పరిశ్రమలో రికార్డుల తిరగరాతకు సమయం ఆసన్నమైనట్టు కనిపిస్తున్నది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, ఇండియన్ సూపర్‌స్టార్లు రజనీకాంత్, అక్షయ్ కుమార్ కలయికలో 2.0 చిత్రం గురువారం (నవంబర్ 29న) ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం అన్ని రకాలుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. వివరాల్లోకి వెళితే..

2.O మూవీ కథ
మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల కలిగే ముప్పు నేపథ్యంగా 2.0 చిత్రం రూపొందింది. మొబైల్ ఫోన్ల రేడియేషన్ల వల్ల మానవులకే కాదు. ప్రపంచంలోని పక్షులకు, జంతువులకు కూడా హానికరం మారనున్నదనే కథతో తెరకెక్కింది. మానవ, జంతు ప్రపంచానికి హాని తలపెట్టే మొబైల్ ఫోన్‌పై కౌ మ్యాన్ (అక్షయ్ కుమార్) చేసే దాడి నేపథ్యంగా కథ నడుస్తుందనేది తాజా సమాచారం.

మరోసారి తెర మీద చిట్టి, వశీకరణ్
రోబో చిత్రంలో కనిపించిన మర మనిషి చిట్టి, వశీకరణ్ పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారబోతున్నాయి. అలాగే రజనీకాంత్ సరసన బాలీవుడ్ నటి అమీ జాక్సన్ నటించింది. ఈ సినిమాలో అమీ జాక్సన్ పాత్ర కూడా ప్రభావవంతంగానే ఉంటుందనే తాజా సమాచారం.

విలన్‌గా అక్షయ్ స్పెషల్ అట్రాక్షన్
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తొలిసారి దక్షిణాది చిత్రంలో నటించడం విశేషం. అంతేకాకుండా అక్షయ్ విలన్ పాత్రలో కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. పక్షి పాత్రలో కనిపించే అక్షయ్ సుమారు నాలుగు గంటలపాటు మేకప్ కోసం వెచ్చించడం అంచనాలు పెంచింది.

అదిరిపోయేలా ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్
2.O చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇక నీరవ్ షా సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా మారింది.

సరికొత్త 3డీ టెక్నాలజీతో
రోబో చిత్రానికి సీక్వెల్‌గా 2.0 చిత్రం తెరకెక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా నేటివ్ 3డీలో నేరుగా చిత్రీకరించారు. దీంతో ఆడియెన్స్‌కు కొత్త రకమైన అనుభూతిని పొందే అవకాశం ఏర్పడింది. భారీ రేంజ్‌లో వీఎఫ్‌ఎక్స్ గ్రాఫిక్‌తో సినిమాను అత్యంత సాంకేతికతతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా దాదాపు రూ.600 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందింది.

10 వేలకుపైగా స్క్రీన్లలో
ప్రపంచవ్యాప్తంగా 10 వేల స్కీన్లలో 2.O రిలీజ్ కానున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 లక్షలకుపైగా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అమెరికాలో ప్రీమియర్ షో
శంకర్ రూపొందించిన 2.0 చిత్రం పలు బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు సిద్దమైందనే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో బుధవారమే ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ప్రీమియర్ షోల ద్వారా 2 మిలియన్ల మార్క్‌ను అధిగమించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











