twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శంకర్ మాయాజాలం 'రోబో'

    By Staff
    |

    Robo
    రజనీ-శంకర్ ల భారీ చిత్రం కొంత భాగం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రజనీకాంత్‌ సైంటిస్టుగా 'రోబో"గా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం వివరాలు బయటకు పొక్కకుండా సెల్‌ఫోన్‌ జామర్లు పెట్టిమరీ షూటింగ్‌ చేస్తున్నప్పటికీ చిత్ర విశేషాలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇంతవరకూ ఎవరూ చేయని సాహసం ఈ చిత్రం ద్వారా దర్శకుడు శంకర్‌ చేస్తున్నారని తెలుస్తోంది. 2400 సంవత్సరంలో సినిమా కథ ప్రారంభం అవుతుందని తెలిసింది. అక్కడ నుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది. భవిష్యత్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన థ్రిల్స్‌ ఒళ్ళు గగుర్పొడిచే విధంగా కథానాయకుడు రజనీకాంత్‌, కథానాయిక ఐశ్వర్యరాయ్‌ లతో పాటు 300మంది ఫైటర్స్‌ పాల్గొన్న ఫైట్‌ను పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వంలో రామోజీ ఫిలింసిటీలో ఇటీవల చిత్రీకరించారు.

    అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని అయ్యంగార్‌ ఇంటర్నేషనల్‌ మరియు యూరోస్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మిస్తుండగా 'జురాసిక్‌ పార్క్‌" చిత్రానికి స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ చేసిన స్టాన్‌ విన్‌స్టన్‌ ఈ చిత్రానికి స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ చేస్తున్నారు అలాగే 'ది లెజెండ్‌, ది మ్యాట్రిక్స్‌" లాంటి హాలీవుడ్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన చైనీస్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ స్టంట్‌ మాస్టర్‌ ఈన్‌ వూ పింగ్‌ 'రోబో" చిత్రానికి స్టంట్స్‌ నిర్వహిస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలతో రూపొందుతున్న ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది..

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X