వందేళ్ల సినీ చరిత్రలో రికార్డ్: శంకర్ ‘ఐ’ ఆడియో
హైదరాబాద్: చియాన్ విక్రమ్ హీరోగా ఆస్కార్ ఫిలింస్ ప్రై.లి.బ్యానర్లో గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఐ'. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమాని కూడా నిర్మించని విధంగా 180 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్ తో ‘ఐ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ కలిసి ‘మనోహరుడు'గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెప్టెంబర్ 15న ‘ఐ' చిత్రానికి సంబంధించిన ఆడియో ఫంక్షన్ చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరుగబోతోంది.

భారీగా సీని అభిమానులు తరలి రానున్న నేపథ్యంలో దాదాపు ఏడెకరాల విస్తర్ణం ఉండే నెహ్రూ స్టేడియాన్ని ఆడియో వేడుకగా ఎంచుకున్నారు. ఈ ఆడియో ఫంక్షన్‌కి హాలీవుడ్ సూపర్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగెర్, సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. వందేళ్ల భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో 20,000 థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











