‘ఐ’ లైన్ క్లియర్: సెన్సార్ రిపోర్ట్ ఓకే, 14న విడుదల
హైదరాబాద్: అద్భుతాల నిలయంగా హిట్ చిత్రాల దర్శకుడు శంకర్, చియాన్ విక్రమ్ కథానాయకుడుగా తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ఐ' ఎలాంటి ఆటంకాలు, మరెలాంటి ఇబ్బందులు లేకుండా సాంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. ఈ చిత్రానికి సెన్స్ బోర్డ్ నుండి యు/ఎ సర్టిఫికెట్ పొందింది.
పలు విజయవంతమైన చిత్రాలను అందించిన ఆస్కార్ ఫిలింస్ వి.రవిచంద్రన్, మెగా సూపర్ గుడ్ పిలింస్ ప్రై.లి అధినేతలు కలిసి ఈ భారీ విజువల్ వండర్‌ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆస్కార్ ఫిలింస్ అధినేత వి.రవిచంద్రన్ మాట్లాడుతూ ‘ఐ' సినిమాకు సంబంధించిన అన్ని సమస్యలు క్లియర్ అయిపోయాయి అని తెలిపారు.

తెలుగు, తమిళం, హిందీ బాషలతో పాటు ప్రపంచమంతటా జనవరి 14న యు/ఎ సర్టిఫికెట్ తో సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు. మా ‘ఐ' చిత్రం సంబంధించి ఎలాంటి సమస్యలు లేవు. అన్నీ క్లియర్ అయిపోయాయి.
హాలీవుడ్ చిత్రాల స్థాయికి దీటుగా ప్రముఖ దర్శకుడు శంకర్ దీన్ని రూపొందించారు. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం అందరినీ అలరిస్తోంది. ఈ చిత్రం అన్ని తరగతులను, ప్రేక్షకులను మెప్పిస్తుంది అని చెప్పారు. చియాన్ విక్రమ్ సరసన ఎమీ జాక్సన్ కతానాయికగా నటించిన ఈ చిత్రంలో సురేష్ గోపీ, ఉపేన్ పటేల్, సంతానం, రాంకుమార్ గణేషన్, శ్రీనివాసన్, సయ్యద్ సిద్ధిక్ మొదలైన వారు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. . ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి మాటలు: శ్రీరామకృష్ణ, పాటలు: సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్.


Click it and Unblock the Notifications











