»   » శంక‌ర్ 'ఐ': ఆశ్చర్యపరిచే కొత్త విశేషాలు (ఫోటో ఫీచర్)

శంక‌ర్ 'ఐ': ఆశ్చర్యపరిచే కొత్త విశేషాలు (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ప్రముఖ తమిళ దర్సకుడు శంకర్ తెర‌కెక్కిస్తున్న ఐ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అంశాలు ఒక్కొక్కటి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. హీరో, హీరోయిన్‌గా విక్రమ్ స‌ర‌స‌న అమీజాక్సన్ న‌టిస్తుంది. ఈ మూవీ రిలీజ్ కోసం శంక‌ర్ అభిమానులు తెగ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న నేపధ్యంలో వీటికి మంచి ప్రాచుర్యం ఏర్పడుతోంది. ఇంతకీ ఏం అంశాలు బయిటకు వచ్చాయి..

స్టార్‌ హీరోలతో సమానంగా పేరు సంపాదించుకున్న దర్శకుల్లో ముందు వరుసలో ఉంటారు శంకర్‌. భారీతనం, వైవిధ్యం కలగలిపితే శంకర్‌ అనుకోవచ్చు. సినిమా సినిమాకీ కొత్తదనాన్ని చూపిస్తూ వస్తున్నారాయన. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న మరో చిత్రం 'ఐ'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగులో 'మనోహరుడు'గా తీసుకొస్తున్నారు. విక్రమ్‌, అమీ జాక్షన్‌ జంటగా నటిస్తున్నారు. ఆస్కార్‌ ఫిలింస్‌ పతాకంపై వి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్నారు.

శంక‌ర్ రోబో మూవీ వ‌చ్చి మూడు సంవ‌త్సరాలు అవుతున్నా, శంక‌ర్ డైరెక్షన్ నుండి ఆ రేంజ్ మూవీ ఇప్పటి వ‌ర‌కూ రాలేదు. మ‌ధ్యలో స్నేహితుడు మూవీను తీసినా అది కోళీవుడ్‌లోనూ అంతంత మాత్రంగా విజ‌యం సాధించింది. తెలుగులో అయితే స్నేహితుడు మూవీను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. దీంతో శంక‌ర్ ఫుల్ మార్క్ ఉన్న ఫిల్మ్‌గా ఐ చిత్రం క్రేజ్ సంపాందించుకుంది.

చిత్రం విశేషాలు..స్లైడ్ షోలో...

అర్దం ఏంటి...

అర్దం ఏంటి...

తమిళంలో 'ఐ' అంటే అందం, రాజు, గురు, మృదుత్వం అని అర్థాలున్నాయి. తెలుగులో అదే అర్దం వచ్చేలా మనోహరుడు అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

రైటర్స్ ఎవరు...

రైటర్స్ ఎవరు...

డిటెక్టివ్‌ నవలలతో రచయితలుగా పేరుగాంచిన రచయిత ద్వయం డి.సురేష్‌బాబు, ఎ.ఎన్‌.బాలకృష్ణ సినిమాకి కథని అందించారు. దాంతో ఈ చిత్రంపై తమిళనాట మంచి క్రేజ్ ఉంది.

కాస్ట్యూమ్స్ ...

కాస్ట్యూమ్స్ ...

'మెన్‌ ఇన్‌ బ్లాక్‌' సినిమాకి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసిన మేరీ వోగ్ట్‌ ఈ సినిమాకి పని చేస్తున్నారు. సినిమాలో అవి ప్రత్యేక ఆకర్షణ గా నిలవనున్నాయి.

ఫైట్స్ స్పెషల్

ఫైట్స్ స్పెషల్

చైనాకి చెందిన పీటర్‌ మింగ్‌, అనల్‌ అరసు ఆధ్వర్యంలో భారీ పోరాట సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. గతంలోనూ శంకర్ చిత్రాల్లో ఫైట్స్ ప్రత్యేకంగా ఉండేవి. ఇప్పుడు అవి మరింత అద్బుతంగా ఉండనున్నాయి.

విజువల్ ఎఫెక్స్ట్

విజువల్ ఎఫెక్స్ట్

ఆస్ట్రేలియాకి చెందిన రైజింగ్‌ సన్‌ పిక్చర్స్‌ సంస్థ శ్రీనివాస్‌ ఎం.మోహన్‌ ఆధ్వర్యంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందిస్తోంది. స్టన్నింగ్ విజువల్స్ ఉంటాయని చెప్తున్నారు.

చైనా లో..

చైనా లో..

సినిమాలో పావు వంతు చైనాలో చిత్రీకరణ చేశారు. అక్కడ అతి తక్కువ ఉష్ణోగ్రతల మధ్య చిత్రీకరించారు. హునాన్‌ ప్రాంతంలో కీలక సన్నివేశాలు, పోరాటాల్ని తెరకెక్కించారు. బ్యాంకాక్‌, జోధ్‌పూర్‌, కొడైకెనాల్‌, పొల్లాచ్చి, చెన్నై వంటి ప్రాంతాల్లో విక్రమ్‌, ఇతర తారాగణంపై యాక్షన్‌ సన్నివేశాల్ని చిత్రీకరించారు.

నేపధ్య కళ...

నేపధ్య కళ...

'అవతార్‌', 'లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌', 'హోబిట్‌' లాంటి ఇంగ్లిష్‌ సినిమాలకు డిజిటల్‌ మేకప్‌, నేపథ్య కళ విభాగంలో పనిచేసిన వెటా డిజిటల్‌ సంస్థ ఈ సినిమాకి పని చేస్తోంది. ఆ సంస్థకు చెందిన రిచర్డ్‌ టేలర్‌, పీటర్‌ జాక్షన్‌ ఇందులో పనిచేస్తున్నారు.

గెటప్ కోసం...

గెటప్ కోసం...

విక్రమ్‌ గెటప్‌ కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి మేకప్‌మెన్‌లను పిలిపించారు. ఆయన కేశాలంకరణ నుంచి వస్త్రధారణ వరకు అన్నీ వైవిధ్యంగా ఉంటాయట. సీన్‌ఫుట్‌, డావియానా లామంట్‌ వేసిన మేకప్‌ విక్రమ్‌ని ప్రేక్షకులకు కొత్తగా చూపిస్తుందట.

మరో రికార్డ్...

మరో రికార్డ్...

ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 17 భాషల్లో ఈ సినిమాని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

క్లైమాక్స్ కోసమే...

క్లైమాక్స్ కోసమే...

పతాక సన్నివేశాల కోసం 30 రోజుల్ని కేటాయించినట్లు సమాచారం. ఈ చిత్రం క్లైమాక్స్ సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా రూపొందించారని చెప్తున్నారు.

రిలీజ్ డేట్ ని..

రిలీజ్ డేట్ ని..

దీంతో ఐ మూవీ రిలీజ్ డేట్‌ను బ‌య‌ట‌కు అనౌన్స్ చేశారు. 2014, ఏప్రిల్ 14న శంక‌ర్ ఐ చిత్రం విడుద‌ల‌కు సిద్దం అంటూ స్టేట్‌మెంట్ వ‌చ్చేసింది. ఐ మూవీను తెలుగులో మ‌నోహ‌రుడుగా రిలీజ్ అవుతుంది.

 శంకర్‌ మాటల్లో చెప్పాలంటే....

శంకర్‌ మాటల్లో చెప్పాలంటే....

''మా 'ఐ' సినిమా 'జె', 'కె', ... 'టి', 'యు', 'వి' దాటుకొని 'డబ్ల్యూ'కి చేరుకొంది. ముగింపు(జెడ్‌)నకు దగ్గర్లో ఉన్నాం'' అంటూ తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

శంకర్‌, దర్శకుడు

శంకర్‌, దర్శకుడు

''సినిమా చిత్రీకరణకు చాలా సమయం పడుతోంది. విక్రమ్‌ మేకప్‌కు కూడా ఎక్కువ సమయం తీసుకుంటున్నాం. అయితే అందుకు తగ్గట్టే సినిమా కూడా రిచ్‌గా వస్తోంది. సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వైవిధ్యంగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాం. సినిమా మేకప్‌ విభాగంలో పనిచేస్తున్న వెటా సంస్థ భారతీయ సినిమాకి ఓ కొత్తదనాన్ని అందిస్తోంది. విక్రమ్‌ని ఎందుకు గొప్ప నటుడు అంటారో మరోసారి ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలుస్తుంది. అమీ జాక్సన్‌ నటన ఆకట్టుకుంటుంది''

లేటెస్ట్ ఇన్ఫో..

లేటెస్ట్ ఇన్ఫో..

విక్రమ్ ఎపిసోడ్‌ను జ‌న‌వ‌రి నెల‌లో పూర్తిచేసారు. ఇప్పటికే ఐ మూవీకు సంబంధించిన గ్రాఫిక్ వ‌ర్క్ కూడ యాభై శాతం పూర్తైయింది. అదే లేటవుతోందంటున్నారు. ఈ మూవీకు ఏ.ఆర్‌.రెహ‌మ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

అంచనాలకు తగ్గట్టుగా...

అంచనాలకు తగ్గట్టుగా...

సినిమాలో అమీ జాక్సన్‌... దియా పాత్రలో కనిపిస్తుంది. సంతానం, సురేష్‌ గోపీ, రామ్‌కుమార్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: పీసీశ్రీరామ్‌, కళ: ముత్తురాజ్‌, కూర్పు: ఆంటోని.

English summary

 
 The signs of the release of Ai for this summer seem to be visible as the team has completed the shooting as well as dubbing works of the first half of the flick. The team is wrapping up the post-production works in a rapid speed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu