మహేష్ ప్రక్కన సెకెండ్ ఇడియట్ లవర్ బాయ్ ఖరారు....
రజనీని 'రోబో"ను చేసిన శంకర్ మహేష్ బాబును ఇడియట్ ను చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన త్రీ ఈడియట్స్ ను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది జెమిని ఫిలిం సర్క్యూట్స్ సంస్ధ. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదటి ఇడియట్ గా తెలుగు వెర్షన్ లో మహేష్ బాబు, తమిళంలో విజయ్ తాత్సారం పలు రకాల ఊహాగానాలకు ఊతం ఇస్తున్నది. సెకండ్ ఇడియట్ గా ఆర్య(వరుడు ఫేం) థర్డ్ ఇడియట్ గా జీవా(ఆర్.బి.చౌదరి కుమారుడు)లను ఖరారు చేసారంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సెకెండ్ ఇడియట్ గా సిద్దార్థను ఎంపిక చేసారని తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ఇలియానా కథానాయికగా ఎంపికయ్యింది. డిసెంబర్ 6న ఈ సినిమా ఆరంభంకానుందని సమాచారం.
శంకర్ దర్శకత్వం వహించిన 'బోయ్స్" చిత్రం ద్వారానే హీరోగా పరిచయమైన సిద్దార్థ..ఈ చిత్రంలో సెకండ్ ఇడియట్ గా నటించే ఛాన్స్ వచ్చేసరికి ఎగిరి గంతేసాడని సమాచారం. కాగా సిద్దార్థ తాజా చిత్రం 'బావ"ను నవంబర్ మొదటివారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'బొమ్మరిల్లు" అనంతరం హిట్లులేని సిద్దార్థ 'బావ" పై చాలా ఆశలు పెట్టుకొన్నాడు.


Click it and Unblock the Notifications











