నా కల ఫలించినందుకు చాలా హ్యాపీ: సెన్సేషనల్ డైరెక్టర్
తను కొన్ని సంవత్సరాలుగా కంటున్న కల ఇప్పటికి నిజం అయినందుకు డైరెక్టర్ శంకర్ ఎంతో ఆనందంగా ఉన్నాడు. 'ఇది చాలా కష్టమైన స్క్రిప్ట్. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సహకారంతో నేను అనుకున్న విధంగా తియ్యగలిగాను. చాలా రోజులు ఈ చిత్రం షూటింగ్ జరిగినప్పటికీ మేమనుకున్న షెడ్యూల్ కంటే ముందే కంప్లీట్ అయ్యింది. ఇందులో రెండు మూడు సీన్స్ తప్ప సినిమా అంతా చాలా కష్టంతో కూడుకున్నది. ఇద్దరు మనుషులతో ఈజీగా సీన్స్ తియ్యవచ్చు. కానీ, ఒక మనిషి, ఒక రోబోతో కలిసి చేసే సీన్స్ తియ్యడమనేది చాలా కష్టం. రజనీకాంత్ గారు తప్ప ఈ క్యారెక్టర్ ఇంకెవ్వరు చేసినా ఇంత క్రేజ్ వచ్చి వుండేది కాదు.
సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి కంప్లీట్ అయ్యేవరుకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, సహకారం నేనెప్పటికీ మర్చిపోలేను. అలాగే ఐశ్వర్య రాయ్ కూడా ఎంతో ఓపికతో చేసింది. జీన్స్ తర్వాత మేం కలిసి చేసిన రెండో సినిమా ఇది. అప్పటికీ, ఇప్పటికీ నటిగా ఆమె ఎంతో ఎదిగింది. తన క్యారెక్టర్ గురించే కాకుండా సినిమాకి టెక్నికల్ గా వున్న ప్రాధాన్యతను కూడా ఆమె బాగా గుర్తించి దానికి తగ్గట్టుగానే ప్రతి విషయంలోనూ మాకెంతో కోఆపరేట్ చేసింది. ఈ సినిమా నాకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 'రోబో"ని ఇంతగా ఆదరిస్తున్నారంటే అంతకు మించిన ఆనందం మరొకటి వుండదు" అంటున్నాడు శంకర్.


Click it and Unblock the Notifications











