శంకర్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్.. బాలీవుడ్ హీరోతో మూవీ.. 2.0ను తలదన్నేలా!
సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ కాంబినేషన్‌తో తెరకెక్కించిన 2.0 మూవీతో దర్శకుడు శంకర్ సంచలన విజయం సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఇంతకుముందెన్నడూ లేని విధంగా రూ.500 కోట్లతో 2.0 రూపొందించిన ఘనతను శంకర్ తన ఖాతాలో వేసుకొన్నారు. 2.0 చిత్రం తర్వాత ఇండియన్2 మీద దృష్టిపెట్టిన శంకర్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌పై కన్నేశాడు. ఆ ప్రాజెక్ట్ వివరాలు, ఇతర విషయాలు మీ కోసం..

2.0 మూవీ కోసం
2.0 మూవీలోని పక్షిరాజు పాత్ర కోసం అక్షయ్ కుమార్ కంటే ముందుగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ను సంప్రదించారట. అయితే ఆ పాత్ర చేయడానికి హృతిక్ స్పందించకపోవడంతో అక్షయ్ కుమార్‌తో చేయాల్సి వచ్చింది.

2.0 మూవీపై హృతిక్ రోషన్
2.0 మూవీ రిలీజ్ తర్వాత ఈ పాత్ర గురించి, సినిమాపై హృతిక్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. శంకర్ సార్ తీసిన 2.0 చూశాను. అద్భుతంగా తెరకెక్కించారు. ఇలాంటి సినిమాల్లో నటించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అని హృతిక్ ట్వీట్ చేశారు.

2.0 మూవీని తలదన్నేలా మరో చిత్రం
ఇండియన్2 మూవీ తర్వాత భారీ బడ్జెట్, అంతేకాకుండా అత్యున్నత సాంకేతికతతో మళ్లీ 2.0 మూవీని తలదన్నేలా ఓ సినిమాను శంకర్ ప్లాన్ చేశాడట. ఈ సినిమాలో హృతిక్ హీరోగా నటించనున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందనేది తాజా సమాచారం.

బాలీవుడ్ చిత్రాలతో హృతిక్ రోషన్
హృతిక్ రోషన్ ప్రస్తుతం రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. వికాస్ బెహల్ రూపొందించే సూపర్ 30 చిత్రంలో నటిస్తున్నాడు. అదే విధంగా సిద్దార్థ్ ఆనంద్ రూపొందించే ఇంకా పేరు పెట్టిన చిత్రంలో అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు.

ఇండియన్2 చిత్రంతో శంకర్ బిజీగా
2.0 మూవీ తర్వాత కమల్ హాసన్, కాజోల్ జంటగా శంకర్ ఇండియన్2 మూవీని తెరకెక్కించనున్నాడు. జనవరిలో పోలాచ్చిలో జరిగే షెడ్యూల్‌తో సినిమా ప్రారంభం కానున్నది. ఆ తర్వాత ఉక్రెయిన్‌లో ఈ సినిమా సన్నివేశాలను తెరకెక్కించున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్నది.


Click it and Unblock the Notifications











