Don't Miss!
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- News
రాహుల్ పాదయాత్ర భారీ సక్సెస్- 191కి పెరిగిన కాంగ్రెస్ స్కోరు-పార్ట్ 2కు సన్నాహాలు ?
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
‘రజనీకాంత్ కంటే దర్శకుడు శంకర్ గొప్పోడు’
హైదరాబాద్: ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ....తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవల విడుదలైన ‘ఐ' ట్రైలర్ చూసిన తర్వాత తనదైన రీతిలో ట్విట్టర్లో కామెంట్ల వర్షం కురిపించాడు. ఈ సంక్రాంతి పండగ శంకర్ రాత్రి అవుతుందంటూ కామెంట్స్ చేసారు.
‘ఐ' ట్రైల్ చూసిన తర్వాత ఒక సాధారణ వ్యక్తిగా ఆలోచిస్తే....తమిళనాడులో రజనీకాంత్, జయలలిత కంటే శంకర్ చాలా గొప్పోడిగా కనిపిస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు నేను రజనీకాంత్ అభిమానిగా ఉన్నాను. కానీ ఇపుడు శంకర్ అభిమానికిగా మారుతున్నాను అంటూ వ్యాఖ్యానించారు.

‘ఐ' చిత్రం ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో రజనీకాంత్ ‘లింగా'ను మించి పోతుంది. అందుకే నేను రజనీకాంత్ కంటే శంకర్ గొప్పోడు అంటున్నాను. శంకర్ లాంటి వ్యక్తి అమీర్ ఖాన్ లాంటి హీరోతో సినిమా తీస్తే అది ఇండియన్ ‘అవతార్' అవుతుంది. ఇండియాలో హాలీవుడ్ లెవల్లో సినిమా తీసింది శంకర్ ఒక్కడే అంటూ రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.
దర్శకుడిగా ఇంత వరకూ ప్రేక్షకులు మెచ్చిన ఎన్నో సూపర్ హిట్స్ అందించిన ప్రముఖ దర్శకుడు శంకర్ ఇపుడు చియాన్ విక్రమ్ హీరోగా హాలీవుడ్ చిత్రాల స్థాయికి ధీటుగా ‘ఐ' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ ఫిలింస్ అధినేత వి.రవిచంద్రన్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ విజువల్ వండర్‌ను మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ప్రైలిమిటెడ్ సంస్థ వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చియాన్ విక్రమ్, ఎమీ జాక్సన్ జంటగా నటించిన ఈచిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.