ఆరోగ్య విషయమై శ్రీహరి వైఫ్ డిస్కో శాంతి వివరణ

By Srikanya

హైదరాబాద్:ఒకప్పటి ప్రముఖ తెలుగు నటి, దివంగత రియల్ స్టార్ శ్రీహరి భార్య డిస్కోశాంతి అనారోగ్యం పాలైనట్లు గత నాలుగైదు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె లివర్ కు సంబందించిన సమస్యతో సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అనే వార్త మీడియాలో ప్రముఖంగా వినిపించింది. ముఖ్యంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోనూ, వెబ్ మీడియాలోనూ ఈ వార్తలు ప్రముఖంగా కనిపించాయి.

అంయితే అటువంటిదేమీ లేదని ఈ వార్తలు గురించి తెలుసుకున్న శాంతి శ్రీహరి ప్రకటించారు.‘నాకేం కాలేదు నేను క్షేమంగానే ఉన్నా'నని నటి శాంతి శ్రీహరి ప్రకటించారు. తన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందన్న వదంతుల నేపథ్యంలో ఆమె చెన్నైలోని తన సోదరి నివాసంలో విలేకరులతో మాట్లాడారు.

Shanthi Srihari about her health

ఆమె మాట్లాడుతూ... జాండీస్‌ (పచ్చకామెర్లు) కారణంగా అనారోగ్యం బారిన పడిన మాట వాస్తవమేనన్నారు. చికిత్స నిమిత్తం చెన్నైకి వచ్చినట్లు తెలిపారు. తన సోదరి లలితకుమారి నివాసంలో ఉంటూనే చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. మాంసాహారం ముట్టుకోకూడదని వైద్యులు సూచించినప్పటికీ, కొంత ఉపశమనం లభించడంతోటే మాంసాహారం తీసుకోవడం కారణంగా పరిస్థితి విషమించిందని వివరణ ఇచ్చారు. అయితే ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, విషమపరిస్థితుల్లో లేనని స్పష్టం చేశారు.

ఇంటర్నెట్‌లో తన ఆరోగ్య పరిస్థితి గురించిన వార్తలు చదివి హైదరాబాద్‌లోని తన కుమారుడు కంగారు పడ్డారని, వెంటనే ఫోన్‌ చేసి ఆరోగ్యం గురించి ఆరా తీశారని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X