ఆ హీరో సెక్సీ సింహం
తన సరసన నటించిన హీరోయిన్ శ్రధ్దాదాస్ తో ఎక్కువ సేపు సరదాగా గడపలేకపోయానని బహిరంగంగానే హీరో జగపతిబాబు చెబుతున్నారు. తెరపై జగపతిబాబు అంటే ఆడవాళ్ళు పడి చస్తారని, అలాగే తాను సరదాగా వారితో ఉంటానని జగపతిబాబు తెలిపారు. కానీ అధినేత చిత్రం ద్వారా ఆ అవకాశం లభించలేదన్నారు. ఎందుకంటే..షూటింగ్ చాలా తక్కువ టైమ్‌లో పూర్తి చేయాల్సి వచ్చిందని, దాంతో అస్సలు ఖాళీ లేకుండా పోయిందని ఆయన వెల్లడించారు.
మరోవైపు ఎన్నికలకు ముందే ఈ సినిమా విడుదల కావాలని నిర్మాతలు అనడంతో ఆ పనిమీదే ఎక్కువ శ్రద్ధచూపామని, సరదా విషయాలను ఏ మాత్రం పట్టించుకోలేకపోయామని జగపతిబాబు చెప్పుకొచ్చారు. ఇలా జగపతి తన అభిప్రాయాన్ని చెబితే హీరోయిన్ శ్రధ్దాదాస్ జగపతికి సెక్సీ సింహం అని బిరుదిచ్చేసింది. ఆయన నటన చూస్తే ఓ సింహం అని కనిపిస్తుంది. ఆయనతో నటిస్తే ఓ సెక్సీ సింహం కన్పిస్తుంది..ఏమో నాకలా కన్పిస్తున్నారంది.


Click it and Unblock the Notifications











