»   » కంటికి గాయం: ఏం గుచ్చుకుందో తెలియదన్న శ్రద్ధా కపూర్

కంటికి గాయం: ఏం గుచ్చుకుందో తెలియదన్న శ్రద్ధా కపూర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ కంటికి గాయమైంది. రాక్ ఆన్-2 చిత్రం షూటింగ్ కోసం శ్రద్ధా మేఘాలయ వెళ్లింది. షూటింగ్ జరుగుతుండగా తన కన్ను నొప్పింగా ఉందని శ్రద్ధా చిత్ర యూనిట్‌కు తెలిపింది. ఈ క్రమంలో శ్రద్ధా స్థానికంగా ఉన్న కంటి డాక్టర్ వద్ద పరీక్షలు చేయించుకుంది.

అయితే కార్నియాపై గీతలు వచ్చినట్లు డాక్టర్ తెలిపాడు. మెరుగైన చికిత్స కోసం చిత్ర దర్శకుడు రితేశ్ సిద్వానీ శ్రద్ధాను ముంబైకి పంపించాడు. ఇక రాక్ ఆన్-2 షూటింగ్ మరో రెండు నెలల పాటు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోనే జరుగుతుందని దర్శకుడు తెలిపాడు.

Sharaddha Kapoor injured in shooting

షిల్లాంగ్‌లో షూటింగ్ జరుగుతుండగా తన కంట్లో ఏదో గుచ్చుకుందని, అదేమిటో గుర్తించలేకపోయానని, నిమిషాలు గడుస్తుండగానే నొప్పి తీవ్రమైందని శ్రద్ధా కపూర్ చెప్పింది. లోకేషన్‌లో ఉన్నవాళ్లంతా తన వద్దకు వచ్చారని, ఓదార్చే ప్రయత్నం చేశారని చెప్పింది.

కొద్దిసేపటి తర్వాత తనను కారులో ఆస్పత్రికి తీసుకుని వెళ్లారని, పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్ కనుగుడ్డు స్వల్పంగా చిట్లిందని చెప్పారని అన్నారు. మెరుగైన వైద్యం కోసం ముంబై రాక తప్పలేదని, విమానాశ్రయం నుంచి నేరుగా తమ ఫ్యామిలీ ఐ స్పెషలిస్టు వద్దకు వెళ్లానని శ్రద్ధా వివరించింది.

రెండు రోజుల చికిత్స తర్వాత నొప్పి పూర్తిగా తగ్గిందని, ఇంకో మూడు రోజులు విశ్రాంతి తీసుకుని షిల్లాంగ్ వెళ్తానని చెప్పింది.

English summary
Bollywood actress Shraddha Kapoor injured in Rock on 2 film shooting in Meghalaya.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu