చిరంజీవి, విజయశాంతి ప్రేమ కథ గురించి మీకు తెలుసా?.. షరతులు వర్తిస్తాయి!

స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నూతన దర్శకుడు కుమారస్వామి (అక్షర) చైతన్యరావు మాదాడి, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం షరతులు వర్తిస్తాయి. శ్రీలత, నాగార్జున సామల, శ్రద్ద, శ్రీకుమార్ గుండా తదితరులు నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు ఊడుగుల, మామిడి హరికృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ టీజర్ ఎలా ఉందంటే..

షరతులు వర్తిస్తాయి సినిమా టీజర్ విషయానికి వస్తే.. కరీంనగర్ జిల్లాలోని ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కథగా కనిపించింది. ఇంటి బాధ్యతలు మోసే చిరంజీవి పాత్రలో యువ హీరో చైతన్య రావు నటించాడు. అతడికి ప్రియురాలు విజయశాంతిగా భూమీ శెట్టి కనిపించారు. తల్లి, తమ్ముడు, చెల్లి బాధ్యతలను భుజానికి ఎత్తుకొన్న చిరంజీవి తన చుట్టూ ఉన్న వ్యక్తులను పరిచయం చేయడం టీజర్‌లో కనిపించింది.

Sharathulu Varthisthai! Teaser Review: Chaitanya Rao, Bhoomi Shetty, Kumara Swamy Efforts impressive

షరుతలు వరిస్తాయి సినిమా టీజర్‌ను బట్టి.. పక్కా తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాగా కనిపించింది. పక్కా నేటివిటితో తెలుగు సినిమా పరిశ్రమలోని చిన్న నటీనటుల ప్రతిభను బ్రహ్మండంగా రాబట్టుకోబుతున్నట్టు స్పష్టమైంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి, విజయ్ శాంతి ప్రేమకథతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ భారీగానే ఉండబోతున్నట్టు దర్శకుడు అక్షర కుమార్ చెప్పే ప్రయత్నం చేశారు.

అక్షర (కుమారస్వామి) విషయానికి వస్తే.. అప్పట్లో ఒకడుండే వాడు, నీది నాది ఒకే కథ, విరాటపర్వం, భీమ్లా నాయక్ లాంటి సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ప్రస్తుతం షరతులు వర్తిస్తాయి అనే సినిమాతో దర్శకుడిగా మారారు. టీజర్‌తో సమకాలీన సామాజిక పరిస్థితలపై మంచి విజన్ ఉన్న దర్శకుడిగా అనిపించారు.

నటీనటులు: చైతన్య రావ్, భూమి శెట్టి, నందకిషోర్, మల్లేష్ బలాస్ట్, పద్మావతి, వెంకీ మంకీ, ఆర్జే అవినాష్ తదితరులు

రచన, దర్శకత్వం: కుమారస్వామి (అక్షర)
నిర్మాత: శ్రీలత, నాగార్జున్ సామల, శ్రద్దా, సురేష్ కుమార్ గుండా, విజయ, కృష్ణకాంత్ చిట్టాజల్లు
ఎడిటింగ్: వంశీకృష్ణ, రక్షిత్ కుమార్
డైలాగ్స్: పెద్దింటి అశోక్ కుమార్
సినిమాటోగ్రఫి: ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ప్రిన్స్ హెన్రీ
మ్యూజిక్: అరుణ్ చిలువేరు, సురేష్ బొబ్బిలి
బ్యానర్: స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X