పవన్ కళ్యాణ్ తో స్టేజీ పంచుకోవాలని ఉందా
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా కోసం పంజా మానియా అనే కాంటెస్ట్ ని పెట్టారు.అందుకోసం అరవై సెకండ్ల డ్యూరేయన్ ఉండే వీడియోని తయారు చేసి పంపాలి.అందులో పవన్ కళ్యాణ్ క్లిప్పింగ్స్, మీతో కలిసి ఉన్న మీ గ్రూప్ క్లిప్పింగ్,పంజా వాల్ పేపర్స్, పంజా పోస్టర్స్, పవన్ కళ్యాణ్ గురించిన వీడియో గానీ ఆడియో కానీ, చివరగా మీ ట్యాలెంట్ ని చూపే క్లిప్పింగ్. వీటిన్నంటిని కలిపిన వీడియో క్లిప్పింగ్ ని యూట్యూబ్ లో పంజా మంత్ర టైటిల్ అప్ లోడ్ చెయ్యాలి. ఆ తర్వాత ఆ లింక్ ని [email protected] ఎడ్రస్ కి ఈమెయిల్ చెయ్యాలి. వీటితో పాటు మీ పేరు, ఎడ్రస్,ఫోన్ నెంబర్, వయస్సు,యూ ట్యూబ్ యూజర్ ఐడి, యూ ట్యాబ్ లింక్ ఇవ్వాలి.
ఇక గ్రూప్ ఎంట్రీలు అయితే వారి ఫుల్ ఎడ్రస్ తో పాటు విడివిడిగా సెపరేటుగా పేర్లు రాసి పంపాలి. యు ట్యూబ్ ఎక్కౌంట్ తప్పని సరిగా పోటీకి పంపే వారు పేరు మీదే రిజిస్టర్ అయ్యి ఉండాలి.గ్రూప్ ఎంట్రిలలో అయితే ఆ గ్రూప్ లో ఒక వ్యక్తి కి ఎక్కౌంట్ ఉంటే సరిపోతుంది. ఇక టీమ్ పంజా మీరు పంపిన వాటిల్లో బెస్ట్ వీడియోని సెలెక్టు చేస్తుంది. ఆడియో రిలీజ్ పంక్షన్ రోజున పవన్ కళ్యాణ్ వాటిని స్వయంగా చూసి సెలెక్టు చేస్తారు.
గమనిక...ఈ కాంటెస్ట్..ఆదివారం అనగా నవంబర్ ఆరవ తేదీ న క్లోజ్ అవుతుంది.గెలిచిన వారు పవన్ తో పాటు ఆడియో పంక్ష న్ లో పవన్ తో పాటు స్టేజిని షేర్ చేసుకుంటారు. ఇక ఈ విషయాన్ని పంజా యూనిట్ మీడియాకు విడుదల చేసిన అఫీషయల్ ప్రకటన.
కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే విడుదల చేసిన పవన్‌కళ్యాణ్ స్టిల్స్‌కి అపూర్వమైన స్పందన వస్తోంది. ఇందులో ఆయన గెటప్ ఎంత కొత్తగా ఉందో... పాత్ర చిత్రణ కూడా అంత కొత్తగా ఉంటుంది. స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాను న్యూలుక్‌తో ప్రెజెంట్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. యువన్‌శంకర్‌రాజా సంగీతం కూడా ఈ సినిమాకు ఎస్సెట్. నవంబరులో పాటలను, డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం. ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్‌బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్: అనూవర్థన్.


Click it and Unblock the Notifications











