హీరోయిన్ కారు ప్రమాదంపై అనుమానాలు.. మద్యం సేవించి! క్లారిటీ ఇచ్చిన షర్మిల
గత రెండు రోజుల క్రిందట 'కెవ్వు కేక' హీరోయిన్ షర్మిలామాండ్రే కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రభుత్వం విధించిన ఈ లాక్‌డౌన్ సమయంలో హీరోయిన్ కారు ఇలా ప్రమాదానికి గురికావడం, అందులో ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉండటం పలు అనుమానాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ ప్రమాదంపై స్పందించింది షర్మిలామాండ్రే. వివరాల్లోకి పోతే..

స్నేహితుడు లోకేశ్ వసంత్‌తో కారులో హీరోయిన్..
హీరోయిన్ షర్మిలా మాండ్రే తన స్నేహితుడు లోకేశ్ వసంత్‌తో కలిసి జాగ్వర్ కారులో ప్రయాణిస్తుండగా ఊహించని విధంగా ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరులోని వసంత్ నగర్ రైల్వే బ్రిడ్జి వద్ద ఉదయం 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల విచారణ..
రోడ్డు పక్కన ఉన్న ఓ స్తంభాన్ని కారు బలంగా ఢీ కొట్టడంతో ముందు భాగం నుజ్జనుజ్జయింది. దీంతో షర్మిలతోపాటు ఆమె ఫ్రెండ్ లోకేష్ వసంత్ తీవ్ర గాయాలపాలయ్యాడు. షర్మిల, లోకేష్‌లను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.

మద్యం సేవించి ఉన్నారా?
మరోవైపు ఈ ప్రమాదం పై రకరకాల వార్తలు వచ్చాయి. స్నేహితుడితో కలిసి హీరోయిన్ షర్మిల పార్టీ చేసుకున్నారని, ఆ తరువాత అంతా కలసి జాలీరైడ్‌కు వెళ్ళారని చెప్పుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ ఇద్దరూ మద్యం సేవించి ఉన్నారా? అనే అనుమానాలు తలెత్తాయి.
Recommended Video

హీరోయిన్ క్లారిటీ..
ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ స్పందిస్తూ.. తాము పార్టీ చేసుకునేందుకు బయటకు వెళ్ళలేదని చెప్పింది. మిత్రుడితో కలసి మాత్రల కోసం వెళ్ళినప్పుడు అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందని నటి షర్మిలామాండ్రే పేర్కొంది. కడుపునొప్పి ఉండడంతో పాసులు కలిగిన తన స్నేహితులు లోకేశ్, డాన్ థామస్‌లతో కలసి సమీపంలోని ఆసుపత్రికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆమె తెలిపింది.


Click it and Unblock the Notifications











