'బాహుబలి' పై షారూఖ్ ఖాన్ ఇలా వ్యాఖ్యానించారు

By Srikanya

ముంబై‌: మన సినీ పరిశ్రమలో ఇంతకు ముందేన్నడూ లేని భారీ సాంకేతిక పరిజ్ఞానంతో, భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ కలెక్షన్‌లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో సెలబ్రెటీలు అంతా ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బాద్షా కూడా ఈ చిత్రాన్ని చూసి ఇదిగో ఇలా స్పందించారు. ఆ ట్వీట్ ని మీరు చూడండి.

కఠోర శ్రమకు అందిన గొప్ప ఫలితమే బాహుబలి అన్నారు. ఇంతటి ఆదర్శమైన సినిమా తీసినందుకు రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప సవాలును ఎదుర్కొన్నప్పుడే ఆకాశమంత ఎత్తుకు ఎదగగలమని షారుఖ్‌ అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మరో ప్రక్క ఈ ఆనందంలో చిత్ర యూనిట్ యూట్యూబ్‌ ద్వారా ఒక వీడియోను విడుదల చేసింది. చిత్రంలోని ఒక సన్నివేశాన్ని ఆపాదిస్తూ.. వసూలు చేసిన కలెక్షన్‌లను కళ్లకు కట్టినట్లు చూపించారు. మరి ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి.

ఇక ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళ, హిందీ, మళయాళ భాషల్లో రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ వెర్షన్స్ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇంటర్నేషనల్ మార్కెట్లో మినిమం వంద కోట్లు సంపాదించాలని టార్గెట్ చేసినట్లు చెప్తున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ ప్రేక్షకులు చూడటం కోసం ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఆ ప్రేక్షకులను అందుకోవాలంటే... అంతర్జాతీయ నిపుణులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అందులో బాగంగా...హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన Vincent Tabaillon అనే ఎడిటర్ ని ఎంపిక చేసారు.

Vincent Tabaillon గతంలో.."The Incredible Hulk", "Clash of the Titans", "Taken 2" and most recently, "Now You See Me" చిత్రాలకు పనిచేసారు. మొదట్లో ఫ్రెంచ్ చిత్రాలకు పనిచేసిన ఆయన ఇప్పుడు హాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. ఆయన ఎడిట్ చేసే ఈ చిత్రం ఫిలిం ఫెస్టివల్స్ కు వెళ్తుంది. అలాగే ఇక్కడ ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాసం ఉంది. ఒరిజనల్ చిత్రానికి దీనికి తేడా ఉంటుంది.

Sharukh Khan tweet About Baahubali

చిత్రం కలెక్షన్స్ విషయానికి వస్తే...

బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డులు లిఖిస్తూ.. దూసుకుపోతున్న 'బాహుబలి' తెలుగు సినిమాని రూ.400 కోట్ల మైలురాయి దగ్గరకు చేర్చేసింది. కేవలం కొద్ది రోజుల్లోనే ఈ ఘనత సాధించిన చిత్రంగా 'బాహుబలి' చరిత్ర సృష్టించింది.

మంగళవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 'బాహుబలి' రూ.220 కోట్లకు పైచిలుకు వసూళ్లు సాధించింది. హిందీ వెర్షన్‌ రూపంలో దాదాపు రూ.35 కోట్ల వసూళ్లు అందుకొంది. ఓ దక్షిణాది చిత్రం హిందీలో అనువాదమై ఈ స్థాయిలో వసూళ్లు దక్కించుకోవడం బాలీవుడ్‌ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. తొలి రోజే సరికొత్త రికార్డులను నెలకొల్పిన 'బాహుబలి' ఆ దూకుడు 5 రోజులూ కొనసాగించింది.

మరీ ముఖ్యంగా తొలి వారాంతంలో రూ. 105 కోట్ల షేర్‌ సాధించిన తొలి భారతీయ చిత్రంగా 'బాహుబలి' జెండా ఎగరేసింది. అంతకు ముందు 'ధూమ్‌' (రూ.100 కోట్లు), 'హ్యాపీ న్యూ ఇయర్‌' (రూ.99 కోట్లు) రికార్డు 'బాహుబలి' తిరగరాసినట్త్టెంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X