twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షారుఖ్‌ను‌ కాపీ కొట్టడానికా? సెటైర్ వేయడానికా?

    By Pratap
    |

    బాలీవుడ్ బద్ద శ్రతువులైన షారుఖ్-సల్మాన్ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గమంటుందనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. సినిమాల విషయంలో వీళ్ల మధ్య ఉన్న పోటీ తత్వం కాస్తా....ఆ మద్య కత్రినా బర్త్ డే పార్టీలో ఏర్పడ్డ గొడవతో శత్రుత్వంగా మారింది. అయితే ఇద్దరి మధ్య ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ..ఒకరి పెర్ఫార్మెన్స్ పై ఒకరికి మంచి రెస్పెక్ట్ ఉంది.

    ఈ నేపథ్యంలో సల్మాన్ తన తాజా సినిమాలో 'బాడీగార్డ్"లో....షారుఖ్ నటించిన 'దిల్ వాలే దుల్హనియా లే జాయే" సినిమాలోని ఓ సీన్ ను ఉన్నది ఉన్నట్లుగా కాపీ కొట్టాలని నిర్ణయించున్నాడట. ఈ సినిమాలో షారుఖ్-కాజోల్ మధ్య చిత్రీకరించిన ట్రైన్ సన్నివేశం అప్పట్లో బాగా పాపులర్ అయింది. ఈ సీన్ సల్మాన్ కు కూడా బాగా నచ్చింది. బాడీగార్డ్ సినిమా షూటింగ్ మధ్యలో ఆ సినిమా సీడీ తెప్పించుకుని పదేపదే సీన్ను చూస్తూ తెగ ఆలోచిస్తున్నాడట.

    అయితే... సల్మాన్ సన్నిహితులు మాత్రం సీన్ పై మరోలా కామెంట్ చేస్తున్నారు. ఆ సీన్ ను కాపీ కొట్టాలనేది సల్మాన్ ఉద్దేశ్యం కాదని....షారుఖ్ సినిమాలో బాగా పాపులర్ అయిన ఆ సీన్ ను 'బాడీగార్డు" సెటైరిక్ గా చిత్రీకరించడానికే సల్మాన్ ఆ సీన్ ను పదేపదే చూస్తున్నాడని అంటున్నారు.

    English summary
    SRK movie dil vale dulhaniaya le jaye has seen copy to salman khan upcoming bodygaurd. salman thinks that it is satire to SRK's movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X