ఆ దర్శకుడితో శర్వానంద్ సినిమా ఉందట, స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి!
శర్వానంద్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. డైరెక్టర్ హను రాగావపుడి తో ఒక సినిమా సుదీర్ వర్మ తో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. హను సినిమా మొదట ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాల తరువాత శర్వానంద్ దండు పాళ్యం డైరెక్టర్ శ్రీనివాసరాజుతోనూ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని సమాచారం.
కాని ఈ మద్య సోషల్ మీడియాలో శ్రీనివాస్ రాజు సినిమా ఉండదని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. శ్రీనివాస్ రాజు చెప్పిన పాయింట్ నచ్చి దాన్ని డెవలప్ చెయ్యమని శర్వానంద్ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి.

ఆ కథ ఎలాంటిదన్నది ఎక్కడా రివీల్ కాలేదు. రియల్ స్టోరీ తో దర్శకుడిగా మారిన శ్రీనివాస రాజు శర్వాను ఎలాంటి కథతో పడేసాడన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే దండుపాళ్యం అనేది ఒక వాస్తవ స్టోరీ కర్ణాటక జరిగిన ఓ కథను తీసుకుని చిత్రీకరించాడు. ఈ నేపథ్యంలో శర్వా కోసం రియల్ స్టోరిలో చూపించనున్నాడా? లేదా శర్వానంద్ ఇమేజ్ కు తగ్గట్టు కథ రాసాడా తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











