వెనక్కు తగ్గిన శర్వానంద్.. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే?

కరోనా పరిస్థితి కొంచెం కుదుట పడటంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా సినీ థియేటర్ల సీటింగ్ పరిమితి పెంచడంతో కొంత కాలంగా ల్యాబ్ లేక్ పరిమితం అయిన సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. శర్వానంద్ హీరోగా నటించిన తాజా సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాను ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఈ మధ్యనే ప్రకటించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ సినిమా మరో మారు వాయిదా పడింది. ఆ వివరాల్లోకి వెళితే

 వరుస ఫ్లాపులు

వరుస ఫ్లాపులు

శర్వానంద్ ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఆ సినిమా ప్రకటించేటప్పటికే ఆయన మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టారు. అందులో ఒక సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. కానీ ఆ తర్వాత ప్రకటించి తెరకెక్కిన మహా సముద్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 సీనియర్ నటీమణులు

సీనియర్ నటీమణులు

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు'లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో వీరే కాక పెద్ద ఎత్తున నటీనటులను కూడా నటింప చేశారు. ఈ సినిమాలో సీనియర్ నటీమణులు రాధికా శరత్‌కుమార్, ఖుష్బూ మరియు ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఫ్లాప్ గా నిలవడంతో

ఫ్లాప్ గా నిలవడంతో


ఇక ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ గా నిలవడంతో ఈ సినిమా మీద కూడా శర్వానంద్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. పూర్తి ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని శర్వానంద్ నమ్మకం పెట్టుకున్నారు.

సినిమా వాయిదా

సినిమా వాయిదా


అయితే ఫిబ్రవరి 25న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అంతేకాక సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. కానీ కొన్ని రోజుల తర్వాత భీమ్లా నాయక్ థియేటర్లలోకి రానున్నట్టు ప్రకటించారు. ఈ దెబ్బతో ముందు నుంచే ఈ సినిమా వాయిదా వేయడానికి నిర్ణయించుకున్నారు మేకర్స్.

 మార్చి 4న రిలీజ్

మార్చి 4న రిలీజ్

ఈ సినిమాను మరో వారం పాటు వాయిదా వేసి మార్చి 4న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబందించిన అన్ని సెన్సారు కార్య‌క్ర‌మాలు ఇప్పటికే పూర్త‌య్యాయి. సెన్సార్ టీమ్ ఈ సినిమాకు క్లీన్ యు స‌ర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన అన్ని ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు విశేష స్పంద‌న‌ ల‌భించింది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన సినిమా టైటిల్‌ ట్రాక్ , అలాగే వేలంటైన్స్ డే కానుక‌గా రిలీజ్ చేసిన ఓ ఆధ్య పాట‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. మరో పక్క అదే రోజు విడుదలకు సిద్ధంగా ఉన్న వరుణ్ తేజ్ 'గని', కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్'

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X