రిస్క్ చేస్తున్న శర్వానంద్.. బడా సినిమాతో ఢీ కొట్టనున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు'?

శర్వానంద్ హీరోగా నటించిన తాజా సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ మూవీని రెండేళ్ల క్రితం ప్రకటించగా అనూహ్యంగా ఈ సినిమా రిలీజ్ డేట్ తాజాగా ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ ప్రకటించడం పెద్ద విషయం కాదు కానీ పెద్ద సినిమాతో పోటీ పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

 ఆడవాళ్లు మీకు జోహార్లు

ఆడవాళ్లు మీకు జోహార్లు

శర్వానంద్ ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అయితే ఊహించిన మేర అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఆ సినిమా ప్రకటించేటప్పటికే ఆయన మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టారు. అందులో ఒక సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు.

స్టార్ క్యాస్ట్

స్టార్ క్యాస్ట్

కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాకు ఆడవాళ్లు మీకు జోహార్లు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో వీరే కాక పెద్ద స్టార్ క్యాస్ట్ ను కూడా రోప్ చేశారు. ఈ సినిమాలో సీనియర్ నటీమణులు రాధికా శరత్‌కుమార్, ఖుష్బూ మరియు ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 ఫ్యామిలీ డ్రామాగా

ఫ్యామిలీ డ్రామాగా

ఇక ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా మీద కూడా శర్వానంద్ చాలా ఆశలు పెట్టుకున్నాడు పూర్తిగా ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని శర్వానంద్ భావిస్తున్నాడు. అయితే శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన పడి పడి లేచే మనసు సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు కూడా నిర్మాత సుధాకర్ చెరుకూరి కావడంతో సినిమాను డబ్బు తీసుకోకుండానే సినిమా చేసినట్టు చెబుతున్నారు. హిట్ అయితే తనకు లాభాల్లో వాటా ఇవ్వమని నిర్మాతలను కోరాడని తెలుస్తోంది.

అదే రోజున భీమ్లా నాయక్

అదే రోజున భీమ్లా నాయక్

ఆ సంగతి పక్కన పెడితే ఫిబ్రవరి 25న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇక్కడే ఇక తిరకాసు ఉంది. అదేంటంటే అదే రోజున భీమ్లా నాయక్ థియేటర్లలోకి రానున్నట్టు ప్రకటించారు. అయితే ఇలాంటి సినిమా ఉండగా శర్వానంద్ సినిమా రంగంలోకి దిగడం చర్చనీయాంశం అయింది.

మరో సినిమా కూడా

మరో సినిమా కూడా

అదీ కాక ఆయన నటించిన మరో సినిమా కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ కానుందని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆనందంతో పొంగిపోతున్నారు. అందులో ఒకటి ఈ ఆడవాళ్లు మీకు జోహార్లు కాగా మరో సినిమా 'ఒకే ఒక జీవితం'. ఈ సినిమా నుంచి విడుదలైన 'అమ్మ' సాంగ్ తెలుగు జనానికి ఎంతగానో నచ్చింది. ఈ మూవీలో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, అక్కినేని అమల తల్లి పాత్ర పోషించింది. ఈ చిత్రంలో శర్వానంద్ కు జంటగా రితూ వర్మ కనిపిస్తోంది. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించగా, ప్రభు ఎస్ఆర్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు కానీ డేట్ ను మాత్రం ఖరారు చేయ లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X