నటించవద్దని చెప్పాడు: శర్వానంద్
''మమ్మల్ని నటించదవ్దని మొదట్నుంచీ దర్శకుడు శరవణన్ చెబుతూ వచ్చారు. ఆయా సన్నివేశాల్లో మా సహజమైన స్పందన ఎలా వుంటుందనే దానిపైనే శరవణన్ ఆసక్తి చూపారు. మొత్తం షూటింగ్ అంతా సజీవమైన లొకేషన్లలో, నిజమైన సెట్స్‌లో జరిగింది. మేము రోడ్డు మధ్యన నిజమైన ప్రజలమధ్య, బస్టాపుల్లో జనసందోహాల మధ్య పనిచేశాం'' అని చెప్తున్నారు శర్వానంద్. తన తాజా చిత్రం జర్నీ విడుదలై మంచి విజయం సాధించిన నేపధ్యంలో ఆయన మీడియాతో ఇలా స్పందించారు - అలాగే... "నా వరకూ దర్శకుడే సబ్జెక్ట్, ఒక చిత్రం ఒక దర్శకుడి చిత్రమే. నటుడిగా, నేను కథ చెప్పడానికి మాత్రమే సాయపడతాను. ఈ దశలో స్టార్‌డమ్ కోసం నేను నిజంగా చూడడంలేదు. అయితే, ఒక వాణిజ్య విజయం కూడా వుంటే బాగుంటుంది".
ఇక తనకు ఈ సినిమా ఎలా వచ్చిందో చెపుతూ... మరో హీరో డేట్స్ ఇవ్వకపోవడంతో తనకు ఈ చిత్రంలోని పాత్ర లభించిందని అన్నాడు. సాదాసీదాగా వుండే మామూలు యువకుడితో తెరమీద హీరోని చక్కగా కలిపిన పాత్ర తనదని అన్నారు. అలాగే సినిమాలో ప్రమాద సన్నివేశం చిత్రీకరించిన ప్రదేశం నిజంగానే ఎక్కువ ప్రమాదాలు జరిగే చోటని ఆయన చెప్పారు. చెన్నై-తిరుచ్చి మధ్య ఎక్కువ ప్రమాదాలు జరిగే స్థలం అది, గాయపడినవారికి చికిత్స చేసేందుకు దగ్గర్లోనే ఆసుపత్రి కూడా ఏర్పాటైంది అని చెప్పుకొచ్చాడు. ఇక శర్వానంద్, జై,అనన్య, అంజలి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'జర్నీ'.


Click it and Unblock the Notifications











