టికెట్లు హాట్ కేకుల్లా.. కలెక్షన్లను బట్టే సక్సెస్ రేంజ్.. రణరంగంపై శర్వానంద్

యువ హీరో శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్లుగా.. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో,ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'రణరంగం'. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలైంది. ఈ సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమవ్వడం పక్కన పెడితే.. పలు సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఈ సినిమా విజయం పథంలో ముందుకెళ్తున్న సందర్భంలో శర్వానంద్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. ఈ క్రమంలో శర్వానంద్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

 స్క్రీన్ ప్లే ఆధారంగానే

స్క్రీన్ ప్లే ఆధారంగానే

రణరంగం సినిమా కేవలం స్క్రీన్ ప్లే ఆధారంగా సినిమాను స్టైలిష్‌గా రూపొందించాం. ప్రేక్షకులు, ఫ్యాన్స్ బాగుందని చెబుతున్నారు. కానీ ఇండస్ట్రీ మీడియా టాక్ మిక్స్‌డ్‌గా ఉంది. శర్వా మనోడు అనుకొని ఇంకాస్త రివ్యూలు బాగా రాసి ఉంటే సినిమా కలెక్షన్లు పెరిగేవి. రొటీన్‌కు భిన్నంగా చేసిన సినిమా కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అందరూ స్క్రీన్ ప్లే సూపర్బ్ అని అంటారని అనుకొన్నాను. కానీ అలాంటి స్పందన రాలేదు. అయితే కథ లేదని చెప్పిన విషయం నిజమే అని శర్వానంద్ అన్నారు.

 అలాంటి సినిమాలే చేయాలనే

అలాంటి సినిమాలే చేయాలనే

రణరంగంలో నా పాత్రకు మంచి పేరు వచ్చిందని అలాంటి సినిమాలే చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. కానీ నా సినిమాల ఎంపిక అలా ఉండదు. ప్రస్థానం సినిమా తర్వాత కామెడీ సినిమా చేశాను. ప్రతీ సినిమాకు నేను జోనర్ మార్చుకొంటూ డిఫరెంట్ సినిమాలు చేస్తుంటాను. నాకు రివ్యూలపై అసంతృప్తి లేదు. కలెక్షన్లపై మాత్రం హ్యాపీగా ఉంది అని శర్వానంద్ తెలిపారు.

లవర్ బాయ్ ఇమేజ్ నుంచి

లవర్ బాయ్ ఇమేజ్ నుంచి

లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు రణరంగం సినిమా చేయలేదు. కొత్త తరహా సినిమా చేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాలో భాగమయ్యాను. నాకు మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ కావాలనే ఉద్దేశం, కోరిక లేదు. మంచి సినిమాలు చేయడమే నాకు ఇష్టం. రణరంగం విషయంలో స్క్రీన్ ప్లేపై కొన్ని వర్గాల అసంతృప్తి ఉంది. దానిని ఎలా జడ్జ్ చేయాలో తెలియడం లేదు. నిర్మాత చిన్నబాబు, నాగవంశీ మంచి సినిమా తీసావు చాలూ అన్నారు.

ఏ రేంజ్ సంతృప్తి అంటే

ఏ రేంజ్ సంతృప్తి అంటే

రణరంగం సినిమా ఏ రేంజ్ సంతృప్తిని ఇస్తుందో అనే విషయం కలెక్షన్లను బట్టి ఉంటుంది. కలెక్షన్లను బట్టి రణరంగం సినిమాపై గురించి తప్పొప్పులను బేరిజు వేసుకొంటాను. అది ఎప్పడన్నది, ఎన్ని రోజులన్నది ఇప్పుడే చెప్పలేను. కాకపోతే రియలైజేషన్ మాత్రం ఏదో విధంగా, ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది ఎప్పడన్నది కాలం చెబుతుంది. మాస్ ఆడియెన్స్‌కు సినిమా నచ్చిందనే విషయం బుక్ మై షో చూస్తే తెలుస్తుంది. ఎక్కువగా దిగువ క్లాస్ టికెట్లు హాట్‌గా అమ్ముడుపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X