twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా కోసం నిజంగానే పంట పండించారట కానీ.. ‘శ్రీకారం’ సీక్రెట్స్ ఇవే!

    |

    ప్రస్తుతం శ్రీకారం అనే సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. సినిమా టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ఆసక్తిని, ఆలోచనలు కలిగించేలా ఉన్నాయి. వ్యవసాయం, రైతు అనే కాన్సెప్ట్‌లతో ఎన్నో చిత్రాలు వచ్చాయి.. ఇంకా వస్తూనే ఉంటాయి. అయితే అలా తెరకెక్కించే సినిమాల కోసం అందరూ ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. పచ్చని పొలాలున్న లొకేషన్లను వెతికి మరీ పట్టుకుని అక్కడ సినిమా షూటింగ్‌లను కానిచ్చేస్తుంటారు.

    మామూలుగా అక్కడికే..

    మామూలుగా అక్కడికే..


    పచ్చని పంట పొలాలు, చుట్టూ గ్రీనరి కనిపించాలంటే అందరూ దాదాపు పొల్లాచ్చి వైపుకు వెళ్తుంటారు. మహర్షి సినిమా కూడా అక్కడే షూటింగ్ జరుపుకుంది. అయితే ఇలా పచ్చని పొలాల కోసం ఎక్కడికో వెళ్తుంటారు సినిమా వాళ్లు. కానీ శ్రీకారం యూనిట్ మాత్రం కొత్త ఆలోచనను చేసింది.

    తాజాగా అలా..

    తాజాగా అలా..

    తాజాగా శ్రీకారం మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ట్రైలర్‌కు విశేష స్పందన వస్తుండటంతో చిత్రయూనిట్ తమ ఆనందాన్ని మీడియాతో పంచుకుంది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు మాట్లాడుతూ సినిమా గురించి చెప్పుకొచ్చాడు. గోపీ ఆచంట సినిమా సీక్రెట్స్ కొన్ని చెప్పుకొచ్చాడు.

    సహజంగా ఉండేందుకు..

    సహజంగా ఉండేందుకు..


    సినిమా సహజంగా ఉండేందుకు గ్రాఫిక్స్ వర్క్‌ను వీలైనంతగా తగ్గించాలని అనుకున్నారట. పైగా సహజత్వం కనపడేందుకు పంట పొలాల కోసం ఎక్కడికో వెళ్లకుండా మన గ్రామాల్లోనే పండించి మరీ షూట్ చేయాలని భావించిందట చిత్రయూనిట్.

    కరోనా వల్ల..

    కరోనా వల్ల..

    అయితే చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి ప్రాంతంలో సహజంగానే పంటను పండించారట. కానీ కరోనా వల్ల అనుకున్నట్టుగా జరగలేదట. అందుకే కాస్త గ్రాఫిక్స్ కూడా జోడించాల్సి వచ్చిందట. మొత్తానికి సినిమా కోసం పంట పండించడమనేది అభినందించాల్సిన విషయమే.

    ప్రీ రిలీజ్ ఈవెంట్..

    ప్రీ రిలీజ్ ఈవెంట్..


    శర్వానంద్ శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి రాబోతోన్నాడు. ఖమ్మంలో మార్చి 8న చేసే ఈవెంట్‌కు చిరంజీవి, మార్చి 9న హైద్రాబాద్‌లో చేసే ఈవెంట్‌కు కేటీఆర్ ముఖ్య అతిథులుగా రాబోతోన్నారు. మొత్తానికి శ్రీకారం సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసేలానే కనిపిస్తోంది.

    English summary
    Sharwanand And Gopi achanta About Sreekaram,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X