పవన్ కల్యాణ్ ఇంత సింపుల్ వ్యక్తా? జెట్ ఫ్లయిట్ లేదా? యంగ్ హీరోయిన్ షాక్
టాలీవుడ్ హీరో, హీరోయిన్లు శర్వానంద్, కల్యాణి ప్రియదర్శన్ నటించిన రణరంగం సినిమా ఆడియో ఆదివారం కాకినాడలో జరిగింది. ఈ సినిమా వేడుకలో హీరో శర్వానంద్ మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యారు. కాకినాడలో వారంపాటు షూట్ చేశామన్నారు. కాకినాడ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. ఈ సినిమా ఫంక్షన్‌కు రావడం వల్ల రెండు మరిచిపోలేని అనుభూతులు మిగిలాయన్నారు. ఈ సందర్భంగా మధురమైన అనుభూతులను పంచుకొన్నారు. అవేమిటంటే..

పవన్ కల్యాణ్ కలువడం మరచిపోలేని రోజు
నాకు ఈ రోజు మరచిపోలేని దినం. చాలా రోజుల తర్వాత వైజాగ్ ఎయిర్‌పోర్టులో పవన్ కల్యాణ్‌ను కలిశాను. అందుకే నేను మరిచిపోలేని రోజు. ఎందుకు మరిచిపోని రోజని చెప్పడానికి కారణం ఉంది. నేను సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు పవన్ కల్యాణ్ షూటింగ్‌లకు వెళ్లేవాడిని. ఆయన ఎలా నటిస్తారని చూడటానికి వెళ్లి ఆయనను కలిశాను అని శర్వానంద్ తెలిపారు.

ఎలా ఉన్నావని పేరుపెట్టి పిలిచి
మళ్లీ రణరంగం ప్రీ రిలీజ్ కోసం వైజాగ్ వస్తుండగా ఈ రోజు కలిశాను. నన్ను చూడగానే హాయ్ శర్వానంద్ ఎలా ఉన్నావని అడిగారు. సినిమాల్లోకి రాకముందు చూశాను. మళ్లీ ఇప్పుడే చూస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. నీ సినిమాలు బాగుంటున్నాయి. బాగా చేస్తున్నావు. ఎప్పుడో కలిసిన విషయాన్ని గుర్తుపెట్టుకొని మళ్లీ పేరుతో పలకరించినందుకు హ్యాట్సాఫ్. మేక్ మై డే అని శర్వానంద్ అన్నారు.

పవన్ కల్యాణ్ సింప్లిసిటిని చూసి
పవన్ కల్యాణ్‌ను సింప్లిసిటిని చూసి హీరోయిన్ కల్యాణి షాక్ తిన్నారు. ఆయన అంత సింపుల్‌గా అందరితోపాటు ఫ్లయిట్‌లో ప్రయాణం చేస్తారా? ఆయనకు ప్రత్యేకంగా జెట్ ఫ్లయిట్ ఉండదా? అని కల్యాణి అడిగితే.. అమ్మా.. అవన్నీ వదులుకొని మీ కోసం ఇలా ఇప్పుడు సేవ చేస్తున్నారు. ప్రజల కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలిసిందే అని శర్వానంద్ పేర్కొన్నారు.

రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా
నేను సినిమా వేషాల కోసం ట్రై చేస్తున్న సమయంలో అప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెద్ద రైటర్. ఇంకా డైరెక్టర్ కాలేదు. అప్పుడు నాకు ఏదైనా ఆఫర్ ఇవ్వమని అడిగాను. అయితే నీకు ఇస్తే హీరో వేషం అయితేనే ఇస్తానని అన్నారు. ఆయన మాటల వల్లనే హీరోను అయ్యానని, అది కూడా నాకు మరిచిపోలేని విషయమని శర్వానంద్ అన్నారు.


Click it and Unblock the Notifications











