ఆ నా కొడుకు మిస్.. వాడి సంగతి చూసుకొంటా.. శర్వానాంద్ ఎమోషనల్ స్పీచ్

మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ సినిమా విషయానికి వస్తే.. మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. జేక్స్ బిజోయ్ అద్బుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రీరికార్డింగ్ సూపర్‌గా ఇచ్చారు. చిన్న పిల్లలు సూపర్ స్టార్స్‌గా నటించారు. నిన్న స్పెషల్ స్క్రీనింగ్ వేస్తే.. 20 మంది దర్శకులు వచ్చారు. వారంతా పిల్లల గురించి మాట్లాడారు. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు మ్యూజిక్‌కు ఎలా స్పెషల్ ఎట్రాక్షనో.. సుజిత్ వర్క్ కూడా బాగుంది. మరో ప్రపంచానికి తీసుకెళ్లారు. ప్రియదర్శి నిజాయితీ ఉన్న నటుడు. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు ఇది నా సినిమా అనుకొని చేశారు. నేను హీరోను అనుకొని చేశారు. దర్శి అద్బుతంగా నటించావు. నా ఫ్రెండ్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఇంకా శర్వానంద్ మాట్లాడుతూ..

వెన్నెల కిషోర్‌పై ఫన్నీ కామెంట్స్

వెన్నెల కిషోర్‌పై ఫన్నీ కామెంట్స్


వెన్నెల కిషోర్ గురించి మాట్లాడుతూ.. ఆ నా కొడుకు మిస్ అయ్యాడు. సినిమా ప్రమోషన్స్‌కు రాకుండా కిషోర్ తప్పించుకొన్నాడు. వెన్నెల కిషోర్ ఈ వేడుకకు రాకుండా తప్పించుకొన్నాడు. ఎక్కడ ఉన్నా నిన్ను తర్వాత చూసుకొంటాను. అరేయ్ కిషోర్.. నీకు నేను వేషం ఇప్పించాను. నీ సంగతి తర్వాత ఉంటుంది అని శర్వానంద్ అన్నారు.

అమలతో నటించేటప్పుడు

అమలతో నటించేటప్పుడు


కథను నమ్మి.. నేను ఉంటా సినిమాలో అనే ఉద్దేశంతో నటించారు. అందుకు రీతూ వర్మకు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను. ఇక అమల గారు లేకుండా సినిమా లేదు. సినిమాను ఊహించుకోలేను. అమల గారితో నటించేటప్పుడు కష్టం అనిపించలేదు. అమలను చూడగానే అమ్మ మాదిరిగా అనిపిస్తుంది. మనం ఇద్దరం ఓ మ్యాజిక్ చేశాం. సెప్టెంబర్ 9వ తేదీన అందరూ మన గురించి మాట్లాడుకొంటారని అమలా చెప్పారు అని శర్వానంద్ అన్నారు.

టాలీవుడ్‌కు గొప్ప దర్శకుడు రాబోతున్నాడంటూ

టాలీవుడ్‌కు గొప్ప దర్శకుడు రాబోతున్నాడంటూ


దర్శకుడు శ్రీ కార్తీక్ గురించి శర్వానంద్ మాట్లాడుతూ.. అందరిని ఒక టీమ్‌గా చేసిన దర్శకుడు శ్రీ కార్తీక్‌కు థ్యాంక్స్. అద్బుతమైన సినిమాను అందించాడు. టాలీవుడ్‌లో శ్రీ కార్తీక్ గొప్ప దర్శకుడు కాబోతున్నాడు. సినిమాపై ఆయనకు ఉన్న నాలెడ్జ్ ఏంటో సినిమా రిలీజ్ తర్వాత తెలుస్తుంది అని శర్వానంద్ తెలిపారు.

ఐదేళ్ల క్రితం సినిమా మొదలై.

ఐదేళ్ల క్రితం సినిమా మొదలై.

మాకు బిగ్గెస్ట్ సపోర్ట్, నిర్మాత ఎస్ఆర్ ప్రభు. ఈ సినిమా ఐదేళ్ల క్రితం అనుకొన్నాం. కానీ యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత కోవిడ్ పరిస్థితుల వల్ల సినిమా పూర్తి కాలేదు. ఎన్ని నెలలైనా సినిమా మంచిగా రావాలని అనుకొన్నాం. అందుకు ఎస్ఆర్ ప్రభు సహకారం అందించారు. ప్రేక్షకుల అంచనాలను మించి ఈ సినిమా ఉంటుంది. సెప్టెంబర్ 9వ తేదీన థియేటర్‌లో చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది అని శర్వానంద్ అన్నారు.

తెర ముందు.. తెర వెనుక

తెర ముందు.. తెర వెనుక


నటీనటులు: శర్వానంద్, రీతూ వర్మ, అమలా అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు
దర్శకత్వం: శ్రీకార్తీక్
నిర్మాతలు: ఎస్ఆర్ ప్రకాశ్ ప్రభు, ఎస్ఆర్ ప్రభు
డైలాగ్స్: తరుణ్ భాస్కర్
మ్యూజిక్: సుజిత్ సారంగ్
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
ఆర్ట్ డైరెక్టర్: ఎన్ సతీష్ కుమార్
స్టంట్స్: సుదేశ్ కుమార్
పీఆర్వో: వంశీ శేఖర్
రిలీజ్ డేట్: 2022-09-09

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X