రెండు ప్రేమ జంటల 'జర్నీ' (ప్రివ్యూ)
శర్వానంద్ హీరోగా తమిళంలో రూపొందించిన 'ఎంగేయుమ్ ఎప్పోదుమ్' చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'జర్నీ' టైటిల్ తో డబ్బింగ్ చేసి ఈ రోజు విడుల చేస్తున్నారు. అక్కడ మురగదాస్ ఓ హాలీవుడ్ స్టూడియోతో కలిసి నిర్మించిన ఈ చిత్రం రెండు జంటలమధ్య సాగే రెండు ప్రేమకథలతో ఈ సినిమా ఉంటుంది. విడివిడిగా సాగే ఈ కథలకు క్లైమాక్స్ సీన్స్ లో లింక్ ఉంటుంది. ఈ చిత్రం గురించి శర్వానంద్ మాట్లాడుతూ..యాక్సిడెంట్‌లను గురించి వార్తలు రాసేవారు ఎన్ని ప్రాణాలు పోయాయో రాస్తున్నారు గానీ అందుకు గల కారణాన్ని రాయట్లేదు. ఈ సినిమాలోని సన్నివేశాలు అందుకు గల కారణాలను చూపిస్తాయి. సెల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, తాగి వాహనాలు నడపడం వంటివి ఎంత తప్పో తెలుస్తుంది. అన్ని వర్గాల వారికీ నచ్చే సినిమా అవుతుంది.
ఇక దర్శకుడు రవణన్ దర్శకత్వంలో వచ్చిన 'గణేష్' చూశాను. కొన్ని సన్నివేశాలు చాలా బాగా నచ్చాయి. ఆయన సినిమా తీస్తున్నారని తెలిసి కలిశాను. స్క్రిప్ట్ చెప్పారు. బాగా నచ్చింది. అంతకుముందు నా పాత్రకు ఎవరినో అనుకున్నారు. తర్వాత ఏమైందో నన్ను పిలిచి అవకాశమిచ్చారు. తమిళనాడులో ఇంకా ఆడుతూనే ఉంది. అంత పెద్ద హిట్టయిన చిత్రం. నాకు అక్కడ లవర్‌బోయ్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. మురుగదాస్ బాగా చేశావని మెచ్చుకున్నారు. చాలా నేచురల్‌గా చేశావని చాలా మంది అన్నారు అని ఈ చిత్రంపై తన ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అలాగే సురేష్ కొండేటి తెలుగులో 'జర్నీ'ని అనువదించడం ఆనందంగా ఉంది. ఆయన సొమ్ము కోసం తాపత్రయపడే వ్యక్తి కాదు. అభిరుచి గల నిర్మాత అన్నారు. ఇక సురేష్ కొండేటి గతంలో ప్రేమిస్తే,షాపింగ్ మాల్ చిత్రాలు డబ్ చేసి విడుదల చేసారు.
నటీనటులు:శర్వానంద్, జై, అంజలి, అనన్య తదితరులు
సంగీతం: సత్య
ఫొటోగ్రఫీ: వేల్‌రాజ్
సమర్పణ: 3కె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి.
నిర్మాత: సురేష్ కొండేటి
సహ నిర్మాత: సిహెచ్.ప్రద్యుమ్న
దర్శకత్వం: శరవణన్.ప్


Click it and Unblock the Notifications











