శర్వానంద్ కొత్త చిత్రం 'కో అంటే కోటి'
అలాగే ఈ చిత్రంతో శర్వానంద్ నిర్మాతగానూ మారుతున్నాడని పిల్మ్ నగర్ సమాచారం. కొంతమంది స్నేహితులతో కలిసి సొంతంగా ఓ బ్యానర్ ప్రారంభించి ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ చిత్రం కథపై ఉన్న నమ్మకంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దర్శకుడు అనీష్ సైతం.. ఆవకాయ బిర్యాని తర్వాత డైరక్ట్ చేస్తున్న చిత్రం ఇదే కావటం గమనార్హం. శేఖర్ కమ్ముల సహకారం కూడా ఉండనుందని తెలుస్తోంది.
ఇక శర్వానంద్ లేటెస్ట్ గా అల్లరి నరేష్ తో కలిసి చేసిన నువ్వా... నేనా చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత శర్వానంద్ చేస్తున్న చిత్రం ఇదే. అలాగే ఈ చిత్రం అనంతరం చేరన్ దర్శకత్వంలో ఓ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. కథ నచ్చాకే చిత్రం చేస్తానని,అందుకే ప్రాజెక్టులు లేటవుతున్నాయని శర్వానంద్ అంటున్నారు. జర్నీ వంటి చిత్రం తర్వాత చాలా ఆఫర్సే వచ్చినా కొత్త తరహా స్క్రిప్టుకోసం ఆగారని తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ్‌లో 'జెకె ఎనుమ్ నన్బనిన్ వాళ్‌కై' అనే చిత్రంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications












