twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్పీడ్ పెంచిన నిర్మాత.. శర్వానంద్‌తో మరో ప్రాజెక్ట్

    |

    డిస్ట్రీబ్యూటర్‌‌గా సునీల్ నారంగ్ తెలుగు చిత్ర సీమలో ఎన్నే యేళ్లుగా సేవలందిస్తున్నారు. ఆ మధ్య మహేష్ బాబుతో కలిసి థియేటర్ బిజినెస్‌లోకి దిగారు. ఏఎంబీ లాంటి లగ్జరీ మల్టీప్లెక్స్ ఎక్స్‌పీరియెన్స్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ మధ్య నిర్మాతగానూ మారిపోయి చకచకా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నారు. మొదటి చిత్రంగా లవ్ స్టోరీ వంటి కూల్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. శేఖర్ కమ్ముల వంటి దర్శకుడి పని తనానికి మెచ్చి రెండో ప్రాజెక్ట్‌నూ అప్పగించారు.

    తాజాగా సునీల్ నారంగ్ తన పుట్టన రోజు సందర్భంగా తన తదుపరి చిత్రాలపై స్పందించారు. లవ్ స్టోరీ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉండగా కరోనా లాక్ డౌన్ మొదలైందని, ఇంకా 15 రోజుల షూటింగ్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత మిగతా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేస్తామని తెలిపారు. శేఖర్ కమ్ముల పనితనం బాగా నచ్చింది.అందుకే మా తర్వాతి సినిమా కూడా ఆయన తోనే చేయబోతున్నామని చెప్పుకొచ్చారు.

    Sharwanand Next Movie With Sunil Narang Production

    ఒక పెద్ద హీరో తో ఆ మూవీ ఉంటుందని, దానికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తామని సునీల్ నారంగ్ తెలిపారు. అయితే ఈ చిత్రంతో పాటు సునీల్ నారంగ్ మరో ప్రాజెక్ట్‌ను కూడా పట్టాలెక్కించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ అప్ డేట్‌ను ఇచ్చారు. యంగ్ హీరో శర్వానంద్‌తో తమ చిత్రం ఒకటి ఫిక్స్ అయిందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌న కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం చిత్రంతో బిజీగా ఉన్నాడు. సునీల్ నారంగ్ నిఖిల్ 20వ చిత్రాన్ని కూడా నిర్మించబోతోన్నట్టు రీసెంట్‌గానే ప్రకటించారు.

    English summary
    Sharwanand Next Movie With Sunil Narang Production. We are very excited to announce our future Project with ImSharwanand under SVCLLP. Produced by NarayanDas K Narang and Puskur Ram M Rao !!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X