నిత్యామీనన్, శర్వానంద్ కాంబినేషన్ ఖరారు..డిటేల్స్
నందమూరి తారకరామారావు నటించిన 'మిస్సమ్మ' చిత్రంలో 'ఏమిటో ఈ మాయ...' అంటూ సాగే గీతం ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు అదే సినిమా టైటిల్‌గా మారింది. ఈ నెల 22వ తేదీన చిత్రీకరణ మొదలవుతుంది. జి.వి.ప్రకాష్‌కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. గతంలో చేరన్,వెంకటేష్ కాంబినేషన్ లో చిత్రం ప్లాన్ చేసారు. కానీ మెటీరియలైజ్ కాలేదు. అయితే ఈ చిత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంటుందని భావిస్తున్నారు.
శర్వానంద్ మరో ప్రక్క ఆవకాయ బిర్యాని దర్శకుడు అనీష్ కురువిల్లా దర్శకత్వంలో 'కో అంటే కోటి' చిత్రం రూపొందుతోంది. ప్రియా ఆనంద్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరగే కథ అని,రోడ్ మూవీ గా తెరకెక్కుతోందని చెప్తున్నారు. ఈ చిత్రాన్ని మొదట సిద్దార్ధతో అనుకున్నారు కానీ సిద్దార్ద డేట్స్ క్లాష్ రావటంతో శర్వానంద్ ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. అలాగే ఈ చిత్రంతో శర్వానంద్ నిర్మాతగానూ మారుతున్నాడని పిల్మ్ నగర్ సమాచారం. కొంతమంది స్నేహితులతో కలిసి సొంతంగా ఓ బ్యానర్ ప్రారంభించి ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ చిత్రం కథపై ఉన్న నమ్మకంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దర్శకుడు అనీష్ సైతం.. ఆవకాయ బిర్యాని తర్వాత డైరక్ట్ చేస్తున్న చిత్రం ఇదే కావటం గమనార్హం. శేఖర్ కమ్ముల సహకారం కూడా ఉండనుందని తెలుస్తోంది.
ఇక శర్వానంద్ లేటెస్ట్ గా అల్లరి నరేష్ తో కలిసి చేసిన నువ్వా... నేనా చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత శర్వానంద్ చేస్తున్న చిత్రం ఇదే. అలాగే ఈ చిత్రం అనంతరం చేరన్ దర్శకత్వంలో ఈ చిత్రం మొదలవుతోంది. కథ నచ్చాకే చిత్రం చేస్తానని,అందుకే ప్రాజెక్టులు లేటవుతున్నాయని శర్వానంద్ అంటున్నారు. జర్నీ వంటి చిత్రం తర్వాత చాలా ఆఫర్సే వచ్చినా కొత్త తరహా స్క్రిప్టుకోసం ఆగారని తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ్‌లో 'జెకె ఎనుమ్ నన్బనిన్ వాళ్‌కై' అనే చిత్రంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications












