సమంత లాంటి అమ్మాయి దొరికితే కానిచ్చేస్తా.. యంగ్ హీరో రియాక్షన్
ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ విలువైన ఘట్టం. తనకు కాబోయే లైఫ్ పార్ట్నర్ గురించి ఎన్నో కలలు కంటుంటారు యువతీ యువకులు. మన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్‌కి కూడా తనకు కాబోయే వైఫ్ ఎలా ఉండాలనే దానిపై కొన్ని కోరికలు ఉన్నాయి. ఈ విషయాలను తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా వెల్లడించాడు.
తెలుగు చిత్రసీమలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో శర్వానంద్ ఒకరు. వరుస సినిమాలు చేస్తూ వస్తున్న ఈ హీరో తాజాగా తన పెళ్లిపై స్పందించాడు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి మాట్లాడుతూ.. తనకు 'మజిలీ'లో సమంత లాంటి అమ్మాయి భార్యగా దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

అయితే దానికి కారణం కూడా చెప్పాడు శర్వానంద్. భర్త ఏం చేసినా సైలెంట్‌గా ఉండటమే కాదు.. భర్తను బాగా చూసుకుంటుంది కదా అందుకనే అలాంటి భార్య కావాలని చెప్పాడు శర్వానంద్. చూడాలి మరి శర్వానంద్‌కు అలాంటి అమ్మాయి దొరుకుతుందో లేదో!.
ఇకపోతే శర్వానంద్, సమంత జోడీగా నటించిన 'జాను' చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్రయూనిట్.. ఇటీవలే చిత్ర టీజర్ విడుదల చేసి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











