శర్వానంద్ 'ప్రస్థానం' పాయింట్ అదే..
ఇది రాజకీయ నేపథ్యంతో సాగే చిత్రంఅని అందరూ అనుకుంటున్నారు. రాజకీయం అనేది కేవలం ఒక భాగం మాత్రమే. అన్ని రకాల అంశాలూ మిళితమై ఉంటాయి. మనిషి ఏదైతే విత్తుతాడో అదే పొందుతాడు అనే అంశాన్ని ఆధారం చేసుకుని ఈ సినిమాను రూపొందించాం అంటున్నారు 'ప్రస్థానం' దర్శకుడు. వెన్నెల చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయిన దేవా కట్టా మలి చిత్రం 'ప్రస్థానం'. శర్వానంద్, రూబీ పరిహార్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 16న ఈ సినిమా విడుదలవుతోంది. రవి వల్లభనేని నిర్మించిన ఈ చిత్రం విశేషాలు తెలిపటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''పాటలు విడుదలై చాలా కాలమైనా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆలస్యం అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఏప్రిల్ 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ''న్నారు. శర్వానంద్ మాట్లాడుతూ...కథ కోసం దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడ్డారు. సినిమా అంతా పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది. ప్రేక్షకులు కొత్తరకమైన సినిమాను చూసిన అనుభూతిని పొందుతారన్నారు.


Click it and Unblock the Notifications











