ఆ రోజు రేపే కానీ... ఆ రేంజిలో వర్కవుట్ అవుద్దా?
హైదరాబాద్ : శర్వానంద్, నిత్యామేనన్ జంటగా నటించిన చిత్రం 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'. క్రాంతిమాధవ్ దర్శకత్వం వహించారు. కె.వల్లభ నిర్మాత. ఈనెల 6న (అంటే రేపే) ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. రన్ రాజా రన్ చిత్రం తర్వాత రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఓపినింగ్స్ కూడా గత శర్వానంద్ చిత్రాల కన్నా బాగుంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఫీల్ గుడ్ చిత్రం కావటంతో మల్టిఫ్లెక్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
చిత్ర సమర్పకుడు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ''ప్రతి వారం బాక్సాఫీసు ముందుకు ఓ ప్రేమకథ వస్తోంది. అయితే వాటి మధ్య 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇదో విభిన్నమైన ప్రేమకథా చిత్రం. దర్శకుడు క్రాంతిమాధవ్ కథ చెబుతున్నప్పుడు చాలా ఉద్వేగానికి లోనయ్యాను. శర్వా, నిత్యల కాంబినేషన్ మరోసారి ఆకట్టుకొంటుంది. మా సంస్థలో ఓ మంచి చిత్రంగా నిలిచిపోతుందన్న నమ్మకం ఉంది. గోపీసుందర్ అందించిన బాణీలు ఇప్పటికే శ్రోతలను అలరిస్తున్నాయి. వాటిని తెరపై తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంటుంది. విశాఖ అందాల మధ్య ఆవిష్కరించిన ఓ అందమైన ప్రేమకావ్యంగా ఈ చిత్రం నిలిచిపోతుంది''అన్నారు.

విధికి తలొగ్గి తమ ప్రేమను సాఫల్యం చేసుకోలేకపోయిన ఓ జంట ఇరవైయేళ్ల తర్వాత కలుసుకుంటారు. అప్పుడు వారి భావోద్వేగాలు ఎలా వుంటాయి? జీవన గమనంలో వారి దృక్పథాల్లో వచ్చిన మార్పులేమిటి? వారు కలుసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? వారి బంధం చివరకు ఏ తీరాలకు చేరింది? ఈ ప్రశ్నలన్నింటికీ అందమైన దృశ్యరూపమే చిత్ర కథ.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ.... చిరంజీవి నటించిన రాక్షసుడు చిత్రంలోని మళ్లి మళ్లీ ఇది రాని రోజు గీతం ఎంతటి ప్రజాదరణ పొందినదో అందరికీ తెలిసిందే. ఆ పాటలోని పల్లవిని టైటిల్‌గా పెట్టుకోవడం ఆనందంగా వుంది. పరిణితి చెందిన ప్రేమకథా చిత్రమిది. హృదయాల్ని మెలిపెట్టే భావోద్వేగభరిత సన్నివేశాలుంటాయి. సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణలు మనసును కదిలించేలా వుంటాయి. శర్వానంద్ ఈ చిత్రంలో క్రీడాకారుడిగా కనిపిస్తారు. నిత్యామీనన్ పాత్రలో రెండు భిన్న పార్శాలుంటాయి అన్నారు.
చిత్ర సమర్పకుడు మాట్లాడుతూ ‘‘మా సంస్థలో వస్తున్న మరో బ్యూటీఫుల్ యూత్ లవ్ స్టోరీ ఇది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేమ గొప్పతనాన్ని తెలియజేసే సినిమా. శర్వానంద్, నిత్యామీనన్ లాంటి వెర్సటైల్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది. గోపీసుందర్ మంచి సంగీతాన్నిచ్చారు. క్రాంతిమాధవ్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. '' అని తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ -మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న సంగీత దర్శకుడు గోపీ సుందర్ మా చిత్రానికి బాణీలు అందించడం ఆనందం. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. అందమైన ప్రేమకథగా ప్రేక్షకులను అలరిస్తుంది అని తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: జ్ఞానశేఖర్.వి.యస్., మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు.


Click it and Unblock the Notifications











