»   »  ఫంక్షన్ లో ప్రభాస్, గోపిచంద్ అదర్స్ (ఫొటోలు)

ఫంక్షన్ లో ప్రభాస్, గోపిచంద్ అదర్స్ (ఫొటోలు)

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్ : శర్వానంద్, సీరత్ కపూర్ లు జంటగా సుజీత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రన్ రాజా రన్''. ఈ చిత్రం ఆడియో పంక్షన్ కి ప్రభాస్, గోపీచంద్ హాజరయ్యి ఘనంగా విడుదల చేసారు. గిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో హైదరాబాద్ లో జరిగింది.

    జంగ్లీ మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్ లోకి విడుదలైంది. ప్రభాస్ హీరోగా తొలి యత్నంలోనే 'మిర్చి' వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన యు.వి. క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ తమ రెండో చిత్రాన్ని శర్వానంద్ హీరోగా నిర్మిస్తున్నారు

    లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'రన్ రాజా రన్' రూపొందుతోంది. ఇందులో కథ ఉత్కంఠభరితంగా నడుస్తుంది. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే అంశాలు ఉన్నాయి. కథకు టైటిల్ సరిగ్గా సరిపోయింది. ఈ చిత్రంలో కథకు అవసరమైన పాత్రలే ఉంటాయి. తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో దీన్ని నిర్మిస్తున్నారు.

    స్లైడ్ షోలో ఆడియో ఫంక్షన్ ఫొటోలు...

    ఆవిష్కరణ

    ఆవిష్కరణ

    ఆడియో సీడిలను యంగ్ రెబెల్ స్టార్ ఆవిష్కరించారు. గోపిచంద్ తొలి సీడిని అందుకున్నారు.

    ప్రభాస్ మాట్లాడుతూ....

    ప్రభాస్ మాట్లాడుతూ....

    ప్రమోద్, వంశీ చిన్నప్పటి నుంచీ నా బెస్ట్ ప్రెండ్స్. ఈ బ్యానర్ నా ప్యామిలీ ప్రొడక్షన్ లాంటిది. కొరటాల శివను ఇంట్రడ్యూస్ చేసిన విధంగానే ఇప్పుడు సుజిత్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సుజిత్ చాలా టాలెంటెడ్. తన కథ చెప్పేటప్పుడు తన నేరేషన్ స్టైల్ విన్నాను. చాలా బాగుంది. శర్వానంద్ ఈ సినిమా కోసం రూపాయి రెమ్యునేషన్ కూడా తీసుకోలేదు.

    గోపీచంద్ మాట్లాడుతూ...

    గోపీచంద్ మాట్లాడుతూ...

    ప్రమోద్, వంశీ చాలా కాలంగా తెలుసు. మంచి మిత్రులు. మిర్చి సినిమాతో సూపర్ కొటమటి మంచి ప్రొడ్యూసర్స్ గా పేరు తెచ్చుకున్నారు. గిబ్రాన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ప్రతీ సాంగ్ లో వేరియేషన్ ఉంది. ఆడియో పెద్ద హిట్ అవుతుంది. శర్వానంద్ నాకు తమ్ముడులాంటోడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసాను. బాగుంది.

    శర్వానంద్ మాట్లాడుతూ...

    శర్వానంద్ మాట్లాడుతూ...

    మా సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి ధాంక్స్. అందరూ బాగా కష్టపడి పనిచేసాం. సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అని అన్నారు.

    దర్శకుడు సుజిత్ మాట్లాడుతూ...

    దర్శకుడు సుజిత్ మాట్లాడుతూ...

    ముందు అమ్మా, నాన్నలకు ధాంక్స్. షార్ట్ ఫిల్మ్స్ చేసి సినిమా చేస్ను. నా నిర్మాతలు నన్ను బాగా ప్రోత్సహించారు. వారు కథను నమ్మి నాకు దర్శకుడుగా అవకాసం ఇచ్చారు. శర్వానంద్ ను నేనెలా చూపించాలనుకున్నానో అలానే చూపించాను అన్నారు.

    నిర్మాతలు మాట్లాడుతూ .....

    నిర్మాతలు మాట్లాడుతూ .....

    "లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'రన్ రాజా రన్' రూపొందుతోంది. ఇందులో కథ ఉత్కంఠభరితంగా నడుస్తుంది. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే అంశాలు ఉన్నాయి. కథకు టైటిల్ సరిగ్గా సరిపోయింది. ఈ చిత్రంలో కథకు అవసరమైన పాత్రలే ఉంటాయి. తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో దీన్ని నిర్మిస్తున్నాం'' అని చెప్పారు.

    సంగీత దర్శకుడు గిబ్రాన్ మాట్లాడుతూ....

    సంగీత దర్శకుడు గిబ్రాన్ మాట్లాడుతూ....

    మా ఆవిడ తెలుగు అమ్మాయి కాబట్టి నాకు తెలుగు అర్దమవుతుంది. తెలుగులో సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఈ సినిమాతో కుదిరింది. దర్శకుడు ఇచ్చిన సహకారం మరువలేనిది.

    కొరటాల శివ మాట్లాడుతూ...

    కొరటాల శివ మాట్లాడుతూ...

    యువి క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ లు నన్ను నమ్మి దర్శకుడుగా అవకాసం ఇచ్చారు. ఎందుకంటే వారు కథను నమ్ముతారు. అలాగే ఈ సినిమా కోసం వెయిట్ చేసి మంచి కథతో ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమా వారికి పెద్ద సక్సెస్ అవుతుంది అన్నారు.

    రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ...

    రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ...

    మిర్చి తర్వాత నన్ను ఒఖ కుటుంబ సభ్యుడుగా భావించి నాతో ఈ సినిమాలో కూడా పాటలను రాయించిన ప్రమోద్, వంశీలకు ధాంక్స్. గిబ్రన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ స్ధాయిలో మ్యూజి్ నేర్చుకుని అద్బుతమైన సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

    ఎవరెవరు

    ఎవరెవరు

    అడివి శేష్, సంపత్, జయప్రకాశ్‌రెడ్డి, వెన్నెల కిశోర్, అలీ, కోట శ్రీనివాసరావు, విద్యుల్లేఖ రామన్, అజయ్ ఘోష్ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: ఘిబ్రాన్ ఎం., ఛాయాగ్రహణం: మధి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్.

    English summary
    Prabhas and Gopichand will be gracing r ‘Run Raja Run’ audio launch. Vamsi and Pramod who produced Prabhas' Mirchi’ on UV.Creations banner are the producers for the film.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more