ఫన్...టెన్షన్ కలిపి...(‘రన్ రాజా రన్’ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్ : సిని పరిశ్రమలో ముందుకు వెళ్లాలనుకున్న యువత మొదట తమలోని ప్రతిభను షార్ట్ ఫిల్మ్ ద్వారా బయిటపెట్టుకుని, అది చూపించుకుని తర్వాత పెద్ద తెరవైపు ప్రయాణం పెట్టుకుంటున్నారు. దాదాపు 40దాకా షార్ట్ ఫిల్మ్ లు తీసి యు ట్యూబ్ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా 'రన్ రాజా రన్'.

ఇందులో శర్వా చేసిన పాత్ర పేరు రాజా హరిశ్చంద్ర. ఎప్పుడూ నిజాలే చెబుతుంటాడు. అలా చెప్పడం వల్లే తనకి 50 మంది అమ్మాయితో బ్రేకప్ అవుతుంది. మరో ప్రక్క తను ఇష్టపడి ప్రపోజ్ చేయ్యాలకునేలోపు వాళ్ళకి పెళ్లై పోయే సమస్య ఫేస్ చేసే అమ్మాయి. వీరిద్దరికి పరిచయం అయిన తర్వాత వారి జర్నీ ఎలా టర్న్ అయ్యింది అనేదే ఈ సినిమా. లవ్, కామెడీ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. చెప్పాలంటే 'రన్ రాజా రన్' సినిమా 'టామ్ అండ్ జెర్రీ' ఫార్మాట్ లో ఉంటుంది.

Sharwanand's Run Raja Run preview

దర్శకుడు మాట్లాడుతూ... 'రన్ రాజా రన్' అనే సినిమాలో లవ్ ట్రాక్ ఉంటూనే థ్రిల్లింగ్ మోమెంట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్ గా ఉంటే సెకండాఫ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. థియేటర్ కి వచ్చిన వారికి ఏమాత్రం బోర్ కొట్టకుండా ఉండేలా ఈ సినిమాని తీసాం. ఫ్యామిలీ మొత్తం వచ్చి హ్యాపీ గా చూడదగిన చిత్రం 'రన్ రాజా రన్' అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ..."లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'రన్ రాజా రన్' రూపొందింది. ఇందులో కథ ఉత్కంఠభరితంగా నడుస్తుంది. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే అంశాలు ఉన్నాయి. కథకు టైటిల్ సరిగ్గా సరిపోయింది. ఈ చిత్రంలో కథకు అవసరమైన పాత్రలే ఉంటాయి. తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో దీన్ని నిర్మిస్తున్నాం'' అని చెప్పారు.

బ్యానర్: యు.వి. క్రియేషన్స్
నటీనటులు: శర్వానంద్, సీరత్‌కపూర్, అడివి శేష్, సంపత్, జయప్రకాశ్‌రెడ్డి, వెన్నెల కిశోర్, అలీ, కోట శ్రీనివాసరావు, విద్యుల్లేఖ రామన్, అజయ్ ఘోష్ తదితరులు
సంగీతం: ఘిబ్రాన్ ఎం.,
ఛాయాగ్రహణం: మధి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్,
లైన్ ప్రొడ్యూసర్: సందీప్.
నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి,
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుజిత్.
విడుదల తేది: 01,ఆగస్టు, 2014.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X