చాలా ఊహించుకున్నా, మీ తీర్పును గౌరవిస్తున్నా: ‘పడి పడి లేచె మనసు’ రిజల్టుపై శర్వానంద్

Recommended Video

Padi Padi Leche Manasu Movie Team Press Meet over Movie Result | Sharwanand

శర్వానంద్‌, సాయిపల్లవి జంటగా హను రాగవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చితరం 'పడి పడి లేచె మనసు'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బేనర్లో చెరుకూరి సుధాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేదు.

సినిమా ఫస్టాఫ్ బావున్నప్పటికీ... సెకండాఫ్‌లో తేడా కొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మౌత్ టాక్ కూడా యావరేజ్‌గా ఉండటంతో పెద్ద హిట్టవుతుందనుకున్న చిత్ర బృందం అంచనాలు తలక్రిందులు అయ్యాయి. సోమవారం మీడియాతో సమావేశం అయిన శర్వానంద్ రిజల్ట్‌పై స్పందించారు.

పెద్ద హిట్టవుతుందనుకున్నాను...

పెద్ద హిట్టవుతుందనుకున్నాను...

శర్వానంద్ మాట్లాడుతూ... ‘పడి పడి లేచె మనసు' సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాను. పెద్ద సినిమా, పెద్ద రేంజికి వెళుతుంది అనుకున్నాను. సినిమా చేసే ముందు, చేసిన తర్వాత, ఇప్పుడు ఒకటైతే బాగా నమ్మాను. నాకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది, ఇలాంటి ఫిల్మ్ చేసినందుకు గర్వంగా ఉంది... అన్నారు.

 క్రిటిక్స్ అభిప్రాయాలను గౌరవిస్తున్నాను

క్రిటిక్స్ అభిప్రాయాలను గౌరవిస్తున్నాను

నా కెరీర్లో పడి పడి లేచె మనసు లాంటి సినిమా చేశాను అని గొప్పగా చెప్పుకోగలను. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. క్రిటిక్స్ అందరికీ థాంక్స్. మీకు అనిపించింది రాశారు. మీ అభిప్రాయాలను గౌరవిస్తున్నాను. మంచి సినిమాలకు మంచిగా రాశారు, చెడు రాశారు. మీ అందరినీ ఇంప్రెస్ చేయడానికి నెక్ట్స్ టైమ్ తప్పకుండా ప్రయత్నిస్తాను అన్నారు.

ఫోన్ చేసి చాలా మంది అదే విషయం చెప్పారు

ఫోన్ చేసి చాలా మంది అదే విషయం చెప్పారు

ఆడియన్స్‌లో చాలా మంది ఫోన్ చేసి మంచి సినిమా, చాలా బాగా చేశారు, ఫస్టాఫ్ ఎక్సలెంట్, సెకండాఫ్ కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పారు. దీన్ని బట్టి ఇక ముందు ఏమిటి? ఎలా చేయాలి? అని ముందుకు వెళ్లడమే మా పని. మీడియా వారు కూడా కుదిరితే మా సినిమాకు సహాయం చేయండని శర్వానంద్ కోరారు.

ఫస్ట్ వీకెండ్ ఎంత వసూలు చేసింది?

ఫస్ట్ వీకెండ్ ఎంత వసూలు చేసింది?

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ‘పడి పడి లేచె మనసు' ఫస్ట్ వీకెండ్ రూ. 11.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో రూ. 4.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రైటస్ రూ. 19 కోట్లకు అమ్మారు. సినిమాకు లాభాలు రావాలంటే దాదాపు రూ. 20 కోట్ల షేర్ వసూలు కావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X